Woman Kills Daughter: ఈ లోకంలో ఎన్నో బంధాలు ఉన్నా తల్లి ప్రేమ మాత్రం వర్ణించలేనిదని ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే తన పిల్లలు ఎలా ఉన్నా తల్లి మాత్రం తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రతి క్షణం పిల్లలపై ఎలాంటి కల్మషం లేకుండా ప్రేమను చూపిస్తుంది. ఇక తొమ్మిది నెలలు కడుపులో మోయడమే కాదు ఏ కష్టం రాకుండా చూసుకుంటుంది తల్లి. కానీ ఇటీవల కాలంలో కొంతమంది మహిళలు పేగు తెంచుకుని పుట్టిన పిల్లల విషయంలో వ్యవహరిస్తున్న తీరు తల్లి ప్రేమకు మచ్చ తెచ్చే విధంగా ఉంది. తాజాగా ఇలాంటి తరహా ఘటన రాజస్థాన్‌లో జరిగింది.
రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లాలో మూడేళ్ల బాలికను చంపి, కదులుతున్న రైలు నుండి మృతదేహాన్ని విసిరిన కేసులో వివాహిత, ఆమె ప్రేమికుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. నిందితులను సునీత, సన్నీ అలియాస్ మాల్టాగా గుర్తించినట్లు వారు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి ఆ మహిళ తన కుమార్తె కిరణ్‌ను గొంతుకోసి హత్య చేసి సన్నీ సహాయంతో ఆమె మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి శ్రీగంగానగర్ రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. వారు ఉదయం 6:10 గంటలకు రైలు ఎక్కారు. ఆ రైలు ఫతుహి రైల్వే స్టేషన్ ముందు కాలువపై ఉన్న వంతెన వద్దకు చేరుకున్నప్పుడు, వారు కదులుతున్న రైలు నుంచి మృతదేహాన్ని పడవేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ (శ్రీగంగానగర్) ఆనంద్ శర్మ తెలిపారు. మృతదేహాన్ని కాలువలో పడేయాలనుకున్నారని, అయితే అది రైలు పట్టాల దగ్గర పడిందని, మంగళవారం ఉదయం దాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
Steal Wires: టీవీ సీరియల్ స్ఫూర్తితో.. ఐఫోన్ కోసం వైర్లను ఎత్తుకెళ్లారు.. చివరకు?
శాస్త్రి నగర్‌లో నివసిస్తున్న సునీతకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఆమె భర్తతో గతంలోనే విడిపోయింది. ఈ నేపథ్యంలో ముగ్గురు పిల్లలు ఆమె భర్తతో నివసిస్తుండగా.. మరో ఇద్దరు పిల్లలు, తన ప్రియుడు సన్నీతో కలిసి ఆమె శాస్త్రి నగర్‌లో ఉంటోంది. ప్రియుడితో తాను సమయం గడపలేకపోతున్నానని భావించిన సునీత తన కూతురి అడ్డు తొలగించుకోవాలని భావించి.. సోమవారం గొంతు కోసి కిరాతకంగా హత్య చేసింది. మృతదేహాన్ని రైలు నుంచి విసిరేసింది. బాలిక మృతదేహాన్ని గుర్తించిన తర్వాత పోలీసులు సునీతను విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో, ఆమె తన కుమార్తెను చంపినట్లు అంగీకరించింది. ఆ తర్వాత ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.
