NTV Telugu Site icon

Rajasthan: 19 ఏళ్ల యువతి కిడ్నాప్, యాసిడ్ దాడి.. చివరకు మృతదేహాన్ని బావిలో పడేసి..

Rajasthan

Rajasthan

Rajasthan: రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. 19 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసిన దుండగులు, ఆమెను తుపాకీతో కాల్చి, అనంతరం యాసిడ్ దాడి చేశారు. ఆ తరువాత ఆమె మృతదేహం ఓ బావిలో దొరికింది. ఈ ఘటన రాజస్థాన్‌లో కరౌలీ జిల్లాలో జరిగింది. 19 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి.. యాసిడ్ దాడి చేసి, హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిమీద కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై బీజేపీ, బీఎస్పీలు అశోక్‌ గెహ్లాట్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ గాడి తప్పిందని విమర్శలు గుప్పించాయి. బాధిత కుటుంబానికి ఎంపీ కిరోడి లాల్ మీనా, ప్రతిపక్ష బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. వీరు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉంచిన ఆసుపత్రి వెలుపల బైఠాయించారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేసిన ప్రతిపక్ష శాసనసభ్యులు శుక్రవారం రాజస్థాన్ అసెంబ్లీలో ఈ విషయాన్ని లేవనెత్తారు.19 ఏళ్ల మహిళను జూలై 12న ఆమె ఇంటి నుంచి నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నిన్న ఆమె మృతదేహాన్ని బావిలో నుంచి స్వాధీనం చేసుకున్నారు.

Also Read: Robbery in Jagtial: మీ కక్కుర్తి పాడుగాను.. ఇలా కూడా దొంగతనం చేస్తారా..!

ఈ విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితురాలి తల్లి ఆరోపించింది. “మేము నిద్రలో ఉన్నాము. ముగ్గురు నలుగురు వ్యక్తులు తెల్లవారుజామున 3 గంటలకు వచ్చారు. వారు ఆమె నోట్లో గుడ్డలు కుక్కి ఆమెను తీసుకువెళ్లారు. నేను, వాస్తవానికి, అరిచి ఏడ్చాను. కాని వారు అప్పటికే ఆమెను తీసుకెళ్లారు. మేము పోలీస్ స్టేషన్‌కి వెళ్లాము, కానీ వారు కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. వారు కేసు నమోదు చేయకుండా.. బదులుగా నన్ను వెళ్లిపొమ్మని చెప్పారు” అని బాధితురాలి తల్లి చెప్పారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగతా వారి కోసం సెర్చ్ టీమ్‌లు వెతుకుతుండగా, పోలీసులు ఇప్పటివరకు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. “మేము ఈ కేసులో లీడ్స్ పొందాము. మేము బాధితురాలి తల్లితో మాట్లాడాము. ఆమె ఎవరినైనా అనుమానిస్తున్నారా అని అడిగాము. ఆమె ఇంకా ఎవరి పేర్లను పేర్కొనలేదు. ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది” అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఆమె దేహంలో బుల్లెట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అంటే నిందితులు తుపాకీతో కాల్చి, యాసిడ్ దాడి చేసి, మృతదేహాన్ని బావిలో పడేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Also Read: Pragnancy Ladies : గర్భిణీలు ఫోన్లను వాడితే బిడ్డపై ఎఫెక్ట్ పడుతుందా?

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని బాధిత కుటుంబ సభ్యులతో పాటు ధర్నాకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ రాజ్యసభ ఎంపీ కిరోడి లాల్ మీనా డిమాండ్ చేశారు. కాలేజీకి వెళ్తున్న యువతి మృతదేహాన్ని యాసిడ్ పోసి దహనం చేసి, బావిలో పడేసిన ఈ ఘటన హృదయ విదారకంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ట్వీట్ చేశారు. ఈ విషయం అనుమానాస్పదంగా ఉంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం అన్ని కోణాల్లో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ కూడా చాలా సున్నితమైన ఈ విషయాన్ని లోతుగా విచారించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

బాలికపై అత్యాచారం జరిగిందా లేదా అనే విషయాన్ని పోలీసులు ధృవీకరించలేదు. “బాధిత బాలికకు పోస్ట్‌మార్టం నిర్వహించబడింది. మరణానికి కారణం తుపాకీ గుండు అని తెలుస్తోంది” అని కరౌలీ ఎస్పీ మమతా గుప్తా తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షల అనంతరం అత్యాచారంపై నిర్ధారిస్తారని ఆమె తెలిపారు. పరిహారం, ఇతర డిమాండ్ల కోసం అధికారులు కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నారని పోలీసు అధికారి తెలిపారు.