Patriotic Songs : ఉప్పొంగిన దేశభక్తి.. ప్రపంచ రికార్డు నెలకొల్పిన విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan Students Created world record sing patriotic songs
రాజస్థాన్‌లో పాఠశాల విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించి ‘ప్రపంచ రికార్డు’ నెలకొల్పారు. రాజస్థాన్‌లోని దాదాపు కోటి మంది పాఠశాల విద్యార్థులు శుక్రవారం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ప్రచారంలో దేశభక్తి గీతాలు ఆలపించడం ద్వారా “ప్రపంచ రికార్డు” సృష్టించారని అధికారులు తెలిపారు. సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రసంగిస్తూ.. ఈ ఘనత సాధించిన విద్యార్థులను అభినందించారు. ప్రతిష్టాత్మక సంస్థ అయిన లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోటి మంది విద్యార్థులు పాడిన పాటలను విని రాష్ట్ర ప్రభుత్వానికి సర్టిఫికేట్ అందించడం సంతోషంగా ఉందన్నారు. ‘వందేమాతరం’, ‘సారే జహాన్ సే అచా’ వంటి పాటలు, జాతీయ గీతాన్ని విద్యార్థులు దాదాపు 25 నిమిషాల పాటు ఆలపించి రికార్డు సృష్టించారు.
కొత్త తరం సోదరభావం, త్యాగం అనే విలువలను అలవర్చుకోవాలని, వారే దేశ భవిష్యత్తు అని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని తమ ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా దేశంలోని యువకులకు గెహ్లాట్ శుభాకాంక్షలు తెలిపారు. దేశ నిర్మాణంలో మన యువత కీలక పాత్ర పోషించాలి. ఈ రోజున, యువతకు అత్యుత్తమ విద్య, శిక్షణ మరియు తగిన ఉపాధి అవకాశాలను అందించడానికి మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాము” అని ఆయన ట్వీట్ చేశారు. జిల్లా స్థాయిలో జరిగిన కార్యక్రమాలకు సంబంధిత ఇన్చార్జి మంత్రులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
Also Read
- Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
- Sugar Prices: చక్కెర ధరలపై గుడ్‌న్యూస్.. దిగిరానున్న ధరలు
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- IND vs SL 2nd Test: కొలంబో టెస్ట్‌లో భారత్ డిక్లేర్.. శ్రీలంక ముందు భారీ టార్గెట్..
తాజావార్తలు
-
Rambha Urvashi Menaka Trailer: నవ్వులు పూయిస్తున్న అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్.. చూశారా!
-
Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
-
Komaram: నాతో ఉన్నవాళ్లే 15 మంది డైరెక్టర్లయ్యారు.. కానీ మీరు కొత్త జీవితాన్ని ఇచ్చారు
-
Marriage Rumours: జయరామ్ – సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారా? వైరల్ అవుతున్న ఫొటోలు!
-
Sugar Prices: చక్కెర ధరలపై గుడ్‌న్యూస్.. దిగిరానున్న ధరలు
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!