Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Rajasthan Set Target Of 156 Runs For Kolkata

KKR vs RR: రాజస్థాన్ పై విరుచుకుపడిన స్పిన్నర్లు.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?

Published Date :April 19, 2026 , 5:22 pm
By Venkatesh
KKR vs RR: రాజస్థాన్ పై విరుచుకుపడిన స్పిన్నర్లు.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐపీఎల్ 2026 లో భాగంగా 28వ మ్యాచ్ ఈరోజు, ఆదివారం, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 09 వికెట్ల నష్టానికి 155 పరుగులు సాధించింది. కోల్ కతాకు 156 పరుగుల టార్గెట్ ను ఫిక్స్ చేసింది. కోల్ కతా స్పిన్నర్లు రాజస్థాన్ పై విరుచుకుపడడంతో భారీ స్కోర్ కు బ్రేక్ పడినట్లైంది.

Also Read:Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ ఇన్నింగ్స్‌ను వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ ప్రారంభించారు. ఇద్దరూ నిలకడగా ఆడుతూ ఆరో ఓవర్‌లో జట్టు స్కోరును 50 దాటించారు. తొమ్మిదో ఓవర్‌లో వైభవ్ సూర్యవంశీ వికెట్ కోల్పోవడంతో రాజస్థాన్‌కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. వరుణ్ తన స్పిన్‌తో వైభవ్‌ను బోల్తా కొట్టించడంతో, 28 బంతుల్లో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. వైభవ్ ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టాడు. వైభవ్ సూర్యవంశీ తర్వాత వరుణ్ చక్రవర్తి, ధ్రువ్ జూరెల్‌ను ఔట్ చేశాడు. జూరెల్ 5 పరుగులకే ఔటయ్యాడు. సునీల్ నరైన్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ 39 పరుగుల వద్ద ఔటయ్యాడు.

కెప్టెన్ రియాన్ పరాగ్ 12 పరుగుల వద్ద వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటవడంతో నాలుగో వికెట్‌ను కోల్పోయింది. సునీల్ నరైన్, డోనవన్ ఫెరీరాను 7 పరుగుల వద్ద ఔట్ చేశాడు. కార్తిక్ త్యాగి, రవీంద్ర జడేజాను 9 పరుగుల వద్ద ఔట్ చేశాడు. కార్తి త్యాగి బౌలింగ్‌లో షిమ్రాన్ హెట్మయర్ 15 పరుగుల వద్ద ఔటయ్యాడు. కార్తిక్ త్యాగి ఒకే ఓవర్‌లో రవీంద్ర జడేజా, షిమ్రాన్ హెట్మెయర్, రవి బిష్ణోయ్‌లను ఔట్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. బిష్ణోయ్ ఖాతా తెరవకుండానే డకౌట్ అయ్యాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • kkr vs rr aaj ka match
  • KKR vs RR LIVE Score
  • kkr vs rr live updates
  • kkr vs rr today match
  • kolkata knight riders vs rajasthan royals

తాజావార్తలు

  • Tamil Nadu: తమిళనాడులో భారీ పేలుడు.. 17 మంది దుర్మరణం..

  • KKR vs RR: రాజస్థాన్ పై విరుచుకుపడిన స్పిన్నర్లు.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?

  • CSK: సీఎస్‌కు బిగ్ షాక్.. టీమ్ నుంచి మరో బిగ్ ప్లేయర్ ఔట్..

  • PM Modi: లొంగిపోండి లేదంటే వదిలిపెట్టం.. టీఎంసీ గుండాలకు మోడీ ఫైనల్ వార్నింగ్..

  • MG Majestor: ఎంజీ మెజెస్టర్ విడుదలకు సిద్ధం.. ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీ!

ట్రెండింగ్‌

  • Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions