Site icon NTV Telugu

IPL 2026: అస్త్రశస్త్రాలతో సిద్ధమైన రాజస్థాన్ రాయల్స్.. 17 ఏళ్ల నిరీక్షణకు తెరపడేనా?

Rajasthan Royals

Rajasthan Royals

IPL 2026: ఐపీఎల్ 19వ సీజన్‌లో ‘రాయల్’ విజయం కోసం రాజస్థాన్ రాయల్స్ (RR) సిద్ధమైంది. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి, రెండోసారి ట్రోఫీని ముద్దాడాలనే కసితో ఉన్న RR జట్టు .. మార్చి 30న తన తొలి మ్యాచ్ ఆడనుంది. గౌహతి వేదికగా జరగనున్న ఈ హై-వోల్టేజ్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో తలపడనుంది. ఈసారి రాజస్థాన్ రాయల్స్ అభిమానులకు డబుల్ ధమాకా కలగనుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చేసిన బీసీసీఐ.. రాయల్స్ హోమ్ మ్యాచ్‌లను రెండు నగరాలకు పంచుతూ నిర్ణయం తీసుకుంది.

READ ALSO: US-Iran Conflict: పెరిగిన ‘‘పిజ్జా ఆర్డర్లు’’.. ఇరాన్‌పై బిగ్ యాక్షన్‌కు అమెరికా సిద్ధం..?

గౌహతి (అస్సాం): ఇక్కడ 3 కీలక మ్యాచ్‌లు (CSK, ముంబై, RCBలతో) జరగనున్నాయి.

జైపూర్ (రాజస్థాన్): మిగిలిన 4 హోమ్ మ్యాచ్‌లు పింక్ సిటీలో జరగనున్నాయి.

రాజస్థాన్ రాయల్స్ కీలక మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..
మార్చి 30: రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (గౌహతి, 7:30 PM)

ఏప్రిల్ 7: రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్ (గౌహతి, 7:30 PM)

ఏప్రిల్ 10: రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (గౌహతి, 7:30 PM)

ఏప్రిల్ 13: రాజస్థాన్ రాయల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (హైదరాబాద్, 7:30 PM)

ఏప్రిల్ 25: రాజస్థాన్ రాయల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (జైపూర్, 7:30 PM)

మే 24: రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్ (ముంబై, 3:30 PM)

మళ్లీ 2008 సీన్ రిపీట్ అవుతుందా..
తొలి ఐపీఎల్ సీజన్ (2008)లో షేన్ వార్న్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ అద్భుతం చేసింది. ఆనాడు ఫైనల్‌లో చెన్నైని ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. సరిగ్గా 17 ఏళ్ల తర్వాత మళ్లీ జట్టులో ఇప్పుడు అదే జోష్ కనిపిస్తోంది. ఈసారి జట్టులో రవీంద్ర జడేజా, శివం దూబే, సామ్ కర్రాన్ వంటి వరల్డ్ క్లాస్ ఆల్‌రౌండర్లు ఉండటం విశేషం. ముఖ్యంగా లోకల్ బాయ్ రియాన్ పరాగ్ తన సొంత గడ్డ గౌహతిలో చెలరేగిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సీజన్‌లో యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, ఆడమ్ జంపా, షిమ్రోన్ హెట్మేయర్, తుషార్ దేశ్‌పాండే, కుల్దీప్ సేన్ వంటి స్టార్ ప్లేయర్లతో రాజస్థాన్ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. చూడాలి మరి ఈ సారి రాయల్ విక్టరీతో రాజస్థాన్ రాయల్స్ 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కప్‌ను ముద్దాడుతారా లేదా అనేది.

READ ALSO: Reliance Industries: పాపం అంబానీ.. ఒక్కరోజులో రూ.82 వేల కోట్లు లాస్! కారణం ఇదే..

Exit mobile version