Rajasthan Minister: రాజస్థాన్ మంత్రిపై కేసు నమోదు.. ముఖ్యమంత్రిపై మండిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan Minister: తన నియోజకవర్గానికి చెందిన వ్యక్తితో ఆస్తి వివాదంపై క్రిమినల్ బెదిరింపు, కిడ్నాప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ మంత్రి రాజేంద్ర సింగ్ గూడా, తనను తప్పుడు కేసులో ఇరికిస్తున్నారని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై మండిపడ్డారు. సికార్ జిల్లా కక్రానాకు చెందిన వార్డ్ పంచాయతీ సభ్యురాలు దుర్గా సింగ్‌ను అపహరించి, ఆమె నుంచి ఖాళీ బ్యాంకు చెక్కును తీసుకున్నారనే ఆరోపణలపై రాజస్థాన్ సైనిక్ సంక్షేమం, పంచాయతీ శాఖ సహాయ మంత్రి, ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ముఖ్యమంత్రికి తెలియకుండా తనపై ఈ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని మంత్రి అన్నారు.
హోంశాఖ సీఎం వద్దే ఉందని.. మంత్రిపై కేసు నమోదు చేసి ముఖ్యమంత్రికి సమాచారం ఇవ్వకపోవడం సాధ్యం కాదన్నారు. తప్పుడు కేసు నమోదు చేయకూడదన్నారు. తాను ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా కలుస్తానని, మీరు ఏమి ప్రయత్నిస్తున్నారని అడుగుతానని విలేకరులతో అన్నారు. రాజస్థాన్ మంత్రి రాజేంద్ర సింగ్ గూడా, గతంలో బహుజన్ సమాజ్ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి మారారు. అధికార యుద్ధంలో చిక్కుకున్న సచిన్ పైలట్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నాడు. పైలట్‌కు అనుకూలంగా మాట్లాడినందుకు తనను టార్గెట్ చేస్తున్నారని గూడా ఆరోపించారు. రాజేంద్ర గూడా ఆగ్రహంపై ముఖ్యమంత్రి కార్యాలయం ఇంతవరకు స్పందించలేదు. కేసు దర్యాప్తు కోసం క్రైమ్ బ్రాంచ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CB-CID)కి అప్పగించబడింది.
Also Read
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
Child Marriages: బాల్యవివాహాలపై అసోం సర్కారు కఠిన వైఖరి.. నిరసన చేపట్టిన మహిళలు
ఆస్తి లావాదేవీకి సంబంధించి జనవరి చివరి వారంలో మంత్రి తనను ఫోన్లో దుర్భాషలాడారని బాధితురాలు దుర్గా సింగ్ తన ఫిర్యాదులో ఆరోపించారు. మంత్రి తనను బెదిరించి, తన ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లి, బ్లాంక్ చెక్కుపై సంతకం చేయించేందుకు ప్రయత్నించారని తెలిపారు. మంత్రి దుర్గా సింగ్ తన నియోజకవర్గంలో ఒక మహిళను మోసం చేశారని ఆరోపించారు.
తాజావార్తలు
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
-
PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!