Site icon NTV Telugu

Rajasthan Minister: రాజస్థాన్‌ మంత్రిపై కేసు నమోదు.. ముఖ్యమంత్రిపై మండిపాటు

Rajasthan Minister

Rajasthan Minister

Rajasthan Minister: తన నియోజకవర్గానికి చెందిన వ్యక్తితో ఆస్తి వివాదంపై క్రిమినల్ బెదిరింపు, కిడ్నాప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ మంత్రి రాజేంద్ర సింగ్ గూడా, తనను తప్పుడు కేసులో ఇరికిస్తున్నారని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై మండిపడ్డారు. సికార్ జిల్లా కక్రానాకు చెందిన వార్డ్ పంచాయతీ సభ్యురాలు దుర్గా సింగ్‌ను అపహరించి, ఆమె నుంచి ఖాళీ బ్యాంకు చెక్కును తీసుకున్నారనే ఆరోపణలపై రాజస్థాన్ సైనిక్ సంక్షేమం, పంచాయతీ శాఖ సహాయ మంత్రి, ఇతరులపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ముఖ్యమంత్రికి తెలియకుండా తనపై ఈ ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని మంత్రి అన్నారు.

హోంశాఖ సీఎం వద్దే ఉందని.. మంత్రిపై కేసు నమోదు చేసి ముఖ్యమంత్రికి సమాచారం ఇవ్వకపోవడం సాధ్యం కాదన్నారు. తప్పుడు కేసు నమోదు చేయకూడదన్నారు. తాను ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా కలుస్తానని, మీరు ఏమి ప్రయత్నిస్తున్నారని అడుగుతానని విలేకరులతో అన్నారు. రాజస్థాన్ మంత్రి రాజేంద్ర సింగ్ గూడా, గతంలో బహుజన్ సమాజ్ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి మారారు. అధికార యుద్ధంలో చిక్కుకున్న సచిన్ పైలట్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నాడు. పైలట్‌కు అనుకూలంగా మాట్లాడినందుకు తనను టార్గెట్ చేస్తున్నారని గూడా ఆరోపించారు. రాజేంద్ర గూడా ఆగ్రహంపై ముఖ్యమంత్రి కార్యాలయం ఇంతవరకు స్పందించలేదు. కేసు దర్యాప్తు కోసం క్రైమ్ బ్రాంచ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CB-CID)కి అప్పగించబడింది.

Child Marriages: బాల్యవివాహాలపై అసోం సర్కారు కఠిన వైఖరి.. నిరసన చేపట్టిన మహిళలు

ఆస్తి లావాదేవీకి సంబంధించి జనవరి చివరి వారంలో మంత్రి తనను ఫోన్‌లో దుర్భాషలాడారని బాధితురాలు దుర్గా సింగ్ తన ఫిర్యాదులో ఆరోపించారు. మంత్రి తనను బెదిరించి, తన ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లి, బ్లాంక్ చెక్కుపై సంతకం చేయించేందుకు ప్రయత్నించారని తెలిపారు. మంత్రి దుర్గా సింగ్ తన నియోజకవర్గంలో ఒక మహిళను మోసం చేశారని ఆరోపించారు.

Exit mobile version