Site icon NTV Telugu

Rajasthan: సొంత ప్రభుత్వంపై బీజేపీ మంత్రి తీవ్ర ఆరోపణలు

Bjp

Bjp

సొంత ప్రభుత్వంపైనే బీజేపీ మంత్రి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తుంటాయి. కానీ రాజస్థాన్‌లోని ఓ మంత్రి ఏకంగా సొంత పార్టీపైనే తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వానికి చెందిన ఓ ప్రాజెక్టులో రూ.1,140 కోట్ల నష్టం జరిగిందని ఆయన మీడియాకు తెలియజేశారు. ప్రాజెక్ట్‌ను నిలిపివేయాలని, ప్రతిపాదిత ఫైల్‌ను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన 6 నెలలే అయింది. ఇంతలోనే ఇంత పెద్ద ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: Actor Suicide: పవిత్ర మృతి కేసులో ట్విస్ట్.. సహజీవనం చేస్తున్న నటుడు సూసైడ్?

సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వంలో అంతర్గత కుమ్ములాటలు చర్చనీయాంశంగా మారాయి. సీఎం భజన్‌లాల్ శర్మ నిర్వహిస్తున్న హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్‌లో లోపాలపై వ్యవసాయ మంత్రి కిరోడి లాల్ మీనా ధ్వజమెత్తారు. గాంధీనగర్‌లో చేపట్టనున్న హౌసింగ్‌ ప్రాజెక్టు వల్ల ప్రభుత్వానికి రూ. 1,146 కోట్ల నష్టం వాటిల్లుతోందని ఆయన ఆరోపించారు. ఆ ప్రాంతంలో భూమి మార్కెట్ విలువను తక్కువగా పేర్కొనడం దీనికి కారణమని ఆరోపించారు. సీఎం ఆధ్వర్యంలోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (జీఏడీ), కేబినెట్ క్లియరెన్స్ లేకుండా ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకువెళ్తున్నారని మంత్రి మీనా ఆరోపించారు. ప్రాజెక్ట్‌ను వెంటనే నిలిపేయాలని, ఆ ఫైల్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీఎం భజన్‌లాల్ శర్మకు ఈ మేరకు ఆయన లేఖ రాశారు. సీఎం ఎలా స్పందిస్తారోనని ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి: Gautam Gambhir: టీమ్‌ ఇండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్‌ గంభీర్!

Exit mobile version