27 ఏళ్ల నాటి కృష్ణ జింకల వేట కేసుకు సంబంధించి సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ మరికొందరు తారలు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఈ కేసుపై తాజాగా కీలక అప్డెట్ వచ్చింది. ఈ తారలకు సంబంధించిన అప్పీళ్లను విచారణకు జాబితా చేయాలని రాజస్థాన్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ లతో పాటు సోనాలి బింద్రే, నీలం, టబు పేర్లు కూడా కృష్ణ జింకల వేట కేసుతో ముడిపడి ఉన్నాయి. ఈ కేసు విచారణ జూలై 28న రాజస్థాన్ హైకోర్టులో జరుగనుంది. విచారణకు రానున్న అప్పీళ్లలో సైఫ్, సోనాలి బింద్రే, నీలం, టబులను నిర్దోషులుగా విడుదల చేయడంపై రాష్ట్రం చేసిన అప్పీల్, శిక్షకు వ్యతిరేకంగా సల్మాన్ ఖాన్ చేసిన పిటిషన్లు ఉన్నాయి.
READ MORE: Karnataka: విషాదం.. వధువుకు తాళి కట్టిన క్షణాల్లోనే వరుడు మృతి..
అసలు ఏంటి ఈ కేసు?
“హమ్ సాత్ సాత్ హై” అనే సినిమా షూటింగ్ సమయంలో 1998లో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ సమీపంలో 2 కృష్ణ జింకలను సల్మాన్ ఖాన్ సహా పలువురు హత్య చేశారని నమోదైన కేసు.. దశాబ్దాలుగా సాగుతోంది. ఈ క్రమంలోనే కృష్ణ జింకలను చంపాడనే కోపం.. బిష్ణోయ్ తెగకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇక గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన లారెన్స్ బిష్ణోయ్.. గతంలో చాలాసార్లు సల్మాన్ ఖాన్‌ను హత్యం చేసేందుకు ప్రయత్నాలు చేశాడు. అంతేకాకుండా సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని బహిరంగంగానే హెచ్చరికలు కూడా చేశాడు. ఈ క్రమంలోనే ఇటీవలే బాబా సిద్ధిఖీని బిష్ణోయ్ గ్యాంగ్ హత్య చేసిన విషయం తెలిసిందే. బిష్ణోయ్ తెగ ఆరాధ్య దైవంగా కొలుచుకునే కృష్ణ జింకలను చంపడమే సల్మాన్ ఖాన్ చేసిన పెద్ద తప్పు అయింది.
READ MORE: MP DK Aruna: ఖబడ్దార్ పాకిస్తాన్.. భారత్ వైపు చూస్తే అంతం చేస్తాం..
కృష్ణ జింకలతో బిష్ణోయ్‌లకు 550 ఏళ్ల బంధం..
అయితే బిష్ణోయ్ అనేది ఒక తెగ. 15వ శతాబ్దంలో గురు జంభేశ్వర్ (జంబాజీ) ఈ బిష్ణోయ్ తెగకు ఆజ్యం పోశారు. వన్యప్రాణులు, వృక్షసంపద, వాటి సంరక్షణ గురించి.. 29 సూత్రాలతో జంబాజీ ఈ బిష్ణోయ్ తెగకు మార్గనిర్దేశం చేశారు. బిష్ణోయ్ చెప్పిన ప్రధాన సిద్ధాంతాల్లో ప్రధానమైంది కృష్ణ జింకల్ని రక్షించుకోవడం అని 2018లో బిష్ణోయ్ తెగకు చెందిన రామ్ స్వరూప్ చెప్పాడు. అయితే జంబాజీ మరణించే ముందు.. కృష్ణ జింకల్ని తన పునర్జన్మగా భావించాలని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అప్పటినుంచి చనిపోయిన బిష్ణోయ్‌లు మళ్లీ కృష్ణ జింకలుగా పుడతారని బిష్ణోయ్ తెగ వారు విశ్వసిస్తారు. ఈ విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్ చరిత్రకారుడు వినయ్ లాల్.. బిష్ణోయ్ తెగపై జరిపిన పరిశోధనల్లో గుర్తించి చెప్పారు. కృష్ణ జింకలతో బిష్ణోయ్‌లకు 550 ఏళ్ల నుంచి బంధం ఉందని సమాచారం.
