Rajasthan: రాజస్థాన్‌లో దారుణ ఘటన జరిగింది. రక్షించాల్సిన పోలీసే ఓ దళిత వ్యక్తిపై అమానవీయంగా ప్రవర్తించాడు. బాధితునిపై మూత్ర విసర్జన చేశాడు. మూత్రం పోయడమే కాకుండా స్థానిక ఎమ్మెల్యే కాళ్లు నాకించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై క్రై బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే గోపాల్ మీనా, డీఎస్పీ శివకుమార్ భరద్వాజ్ సహా నలుగురిపై బాధితుడు ఈ ఆరోపణలు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో వారందరిపై జామ్‌వరంగఢ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.ఎమ్మెల్యే గోపాల్ మీనా ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. ఈ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పాడు. విచారణలో అన్నీ తేలిపోనున్నాయి.
ఈ ఘటన జూన్ 30న జరిగినట్లు సమాచారం. కానీ భయంతో బాధితుడు మౌనంగా ఉండిపోయినట్లు తెలిపాడు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియా ముందు జరిగిన సంఘటన గురించి బాధితుడు తెలియజేశాడు. బాధితుడు వెల్లడించిన వివరాల ప్రకారం.. 51 ఏళ్ల దళిత బాధితుడు తన ఫిర్యాదులో తోడల్డి ఆంధి గ్రామంలోని భూమిని చూసుకుంటున్నాడు. జూన్ 30వ తేదీ మధ్యాహ్నం భార్యతో కలిసి పొలంలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులు వచ్చి అతడిని ఎక్కించుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యే గోపాల్ మీనా ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ అతన్ని ఒక గదిలో బంధించారు. కొంతసేపటికి మళ్లీ పోలీసులు గదిలోకి వచ్చి అతనిపై దాడి చేయడం ప్రారంభించారు. అతను వారిని విడిచిపెట్టమని వేడుకున్నాడు. ఈ సమయంలో డీఎస్పీ శివ కుమార్ భరద్వాజ్ అతని ముఖంపై మూత్ర విసర్జన చేశాడు. అలాగే రాజ గోపాల్ మీనాకు నివాళులర్పించకుండా తోడల్దిలోని పొలానికి రావడానికి ఎంత ధైర్యం అన్నారు.
Also Read: Solar Plant: దేశంలోనే రెండవ అతిపెద్ద సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్న కంపెనీ
అనంతరం డీఎస్పీ శివకుమార్ భరద్వాజ్, ఇతర పోలీసులు తనను ఓ హాలుకు తీసుకెళ్లారని, అక్కడ డీఎస్పీ శివ కుమార్ భరద్వాజ తనపై యూరిన్ పోసి అవమానించాడని బాధితుడు పేర్కొన్నాడు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే గోపాల్ మీనా ఆ ప్రాంతానికి రాజని.. అతని మాటకు ఎదురులేదని చెప్తూ ఎమ్మెల్యే బూట్లు నాకించారని పోలీసులకు తెలిపాడు. అక్కడి నుంచి వస్తుండగా డీఎస్పీ శివకుమార్ భరద్వాజ్ మళ్లీ తొడల్డి పొలం వద్దకు రావద్దని బెదిరించినట్లు బాధితుడు ఆరోపించాడు. “ప్రభుత్వం మనది, ఎమ్మెల్యే మనది. ఆయన ఆదేశాల మేరకే మా నియామకం జరిగింది. మళ్లీ అక్కడ కనిపిస్తే చంపేస్తారు, మృతదేహం కూడా తెలియకుండా పోతుంది.” అని డీఎస్పీ అన్నట్లు బాధితుడు వెల్లడించాడు.
నిందితుడిపై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించామని, అయితే పోలీసులు కేసు నమోదు చేయలేదని బాధితుడు వాపోయాడు. ఉన్నతాధికారులకు విన్నవించినా కేసు నమోదు చేయలేదని, అనంతరం కోర్టును ఆశ్రయించామన్నారు. జులై 27న జామ్‌వరంగఢ్ పోలీస్ స్టేషన్‌లో కోర్టు ద్వారా కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ విషయంపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆరోపణలను ఎమ్మెల్యే మీనా పూర్తిగా ఖండించారు. ఈ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పాడు. పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు. అయితే బాధితుడిని ఎందుకు బెదిరించారన్న కారణాలపై మాత్రం స్పష్టత లేదు.
