Rajasthan: ప్రస్తుత కలియుగంలో మన అనుకున్న వాళ్లే అవకాశాలను ఆసరాగా చేసుకుని మోసం చేసిన ఉదంతాలు చాలానే చూస్తున్నాం. ప్రస్తుతం ఇలాంటి ఘటనలు అనేకం తెరపైకి రావడంతో నేరాలు కూడా పెరుగుతున్నాయి. అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. కొద్ది రోజుల క్రితం సుధా చౌదరి అనే 32 ఏళ్ల మహిళ తన కుమారుడితో కలిసి స్కూటీపై వెళుతోంది. ఆ సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఈ మహిళను కాల్చిచంపారు. ఈ ఘటనతో జిల్లా మొత్తం ఉలిక్కిపడింది. ఇప్పుడు ఈ షాకింగ్ ఘటనను పోలీసులు బయటపెట్టారు.
Read Also:Silvio Berlusconi: ప్రియురాలికి రూ.906 కోట్ల ఆస్తి.. వీలునామా రాసిన మాజీ ప్రధాని
ఈ హత్య కేసులో నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ మహిళ హత్య వెనుక సూత్రధారి మరెవరో కాదు.. ఆమె సవతి తమ్ముడు. నిందితుడు దిర్ మనోజ్ సింగ్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఆ తర్వాత హత్యకు రచించిన పథకం గురించి పోలీసులకు పూస గుచ్చినట్లు చెప్పాడు. సుధా చౌదరి భర్త పుష్పేంద్ర సింగ్ సీఆర్‌పీఎఫ్‌లో ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుశీలాదేవి అనే మహిళతో రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో సుధా చౌదరి తన అత్తమామలతో కాకుండా తల్లితో కలిసి జీవించింది. తరువాత, పుష్పేంద్ర సింగ్ 27 జూలై 2022 న ప్రమాదంలో మరణించాడు. అతని మరణానంతరం, కారుణ్య ఉద్యోగం విషయంలో అతని ఇద్దరు భార్యలు సుధా చౌదరి, సుశీలాదేవి మధ్య వివాదం జరిగింది.
Read Also:MLA Prasanna Kumar: పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై ఆరోపణలు చేయడం సరికాదు
భర్త చనిపోవడంతో ఇద్దరు భార్యల మధ్య గొడవ జరిగింది. అలాగే, నిందితుడు మనోజ్ సింగ్ తన సోదరుడి రెండవ భార్య అంటే సుశీలాదేవికి మద్దతు పలికాడు. అందుకే హత్యకు పథకం వేసి సుధా చౌదరిని హత్య చేశాడు. మరోవైపు మనోజ్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.