Rajasthan Voter List: రాజస్థాన్‌లో 5.26 కోట్ల మంది ఓటర్లు.. కొత్తగా చేరిన 6.96 లక్షల మందిపై నాయకుల కన్ను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan Voter List: రాజస్థాన్‌లో ఈ ఏడాది నవంబర్-డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఎన్నికల కోసం కమిషన్ అన్ని రాజకీయ పార్టీలు, పరిపాలన అధికారులు, ఇతర వ్యక్తులతో సమావేశాలు నిర్వహించింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు పలు అంశాలపై చర్చించారు. ఇప్పుడు కమిషన్ ఎన్నికల తేదీలను ఎప్పుడైనా ప్రకటించవచ్చు. రాష్ట్ర ఎన్నికల సంఘం తేదీలను ఎప్పుడు ప్రకటిస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇంతలో ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాను మిషన్ బుధవారం విడుదల చేసింది.
2.73 కోట్లకు పైగా పురుష ఓటర్లు
రాష్ట్ర ఎన్నికల విభాగం బుధవారం డేటాను విడుదల చేస్తూ, రాజస్థాన్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 5.26 కోట్లకు చేరుకుంది. అందులో 2.51 కోట్ల మంది మహిళలున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్ గుప్తా మాట్లాడుతూ, “రాష్ట్రంలో ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ కార్యక్రమం సందర్భంగా రాష్ట్రంలో 6.96 లక్షలకు పైగా కొత్త ఓటర్లు చేరారు. ఓటరు జాబితా తుది ప్రచురణ తేదీ నాటికి రాష్ట్రంలో 5.26 కోట్లకు పైగా ఓటర్లు నమోదయ్యారు. వీరిలో 2.73 కోట్ల మందికి పైగా పురుషులు.
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్‌కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
Read Also:Chandrababu: నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్.. కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ
17 వేలకు పైగా ఓటర్లు 100 ఏళ్లు పైబడిన వారు
ఈ సవరణ కార్యక్రమం కింద గత ప్రచురించిన ఓటరు జాబితాలో 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 11.78 లక్షల మంది, 100 ఏళ్లు పైబడిన 17,241 మంది ఓటర్లు నమోదయ్యారని ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్ గుప్తా తెలిపారు.
ప్రత్యేక ఓటర్ల సంఖ్య 5.61 లక్షలు
అదేవిధంగా ప్రత్యేకంగా అర్హులైన మొత్తం 5.61 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఓటరు జాబితాలో నమోదైన ఈ ఓటర్లకు ఎన్నికల సమయంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశాన్ని భారత ఎన్నికల సంఘం కల్పించింది. త్వరలో ఎన్నికల తేదీని ప్రకటిస్తామని ఇటీవల కూడా ఎన్నికల సంఘం విలేకరుల సమావేశంలో తెలిపిన సంగతి తెలిసిందే.
Read Also:Rahul Gandhi: కుక్క తెచ్చిన తంటా.. చిక్కుల్లో పడ్డ రాహుల్ గాంధీ
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్‌గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్‌ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!