NTV Telugu Site icon

Rajasthan Election: రాజస్థాన్ లో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది..

Sachin Pailot

Sachin Pailot

రాజస్థాన్‌లోని 200 అసెంబ్లీ స్థానాల్లో 199 స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పోటీలో అధికార కాంగ్రెస్, బీజేపీతో సహా ప్రధాన రాజకీయ పార్టీలు అనేక రోజుల ప్రచారం తర్వాత ఓటింగ్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ జైపూర్‌లోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీని తర్వాత.. మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తమ పార్టీకి మరో అవకాశం వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈసారి ప్రభుత్వాన్ని మార్చే ధోరణి మారాలన్నదే ప్రజల అని అన్నారు.

Read Also: Chandra Grahan 2024: వచ్చే ఏడాది భారత్ లో మొదటి చంద్రగ్రహణం.. ఎప్పుడంటే..?

ఇక, రాజస్థాన్ ప్రజలు గత 5 సంవత్సరాలలో కాంగ్రెస్ పరిపాలనను చూశారు.. వారికి ఓ అంచనా ఉంది దాన్నికి అనుగుణంగానే వారు ఓటు వేస్తారు అంటూ సచిన్ పైలెట్ పేర్కొన్నారు. అయితే, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో విభేదాలపై ప్రశ్నకు అతను పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.. మేము కలిసి పార్టీ కోసం పని చేశాము.. ఇది ఇద్దరు ముగ్గురు వ్యక్తుల గురించి కాదు.. రాజస్థాన్‌లోని కాంగ్రెస్ కూటమి ఏకమైంది అని సచిన్ పైలెట్ పేర్కొన్నారు. రాజస్థాన్ ప్రజలు మంచి నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను.. కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని నేను భావిస్తున్నాను అంటూ ఆయన తెలిపారు. గత 5 సంవత్సరాలలో బీజేపీ పని తీరును ప్రజలు చూశారు.. కాబట్టి ప్రజల మా పార్టీ వైపే ఉన్నారు అని సచిన్ పైలెట్ తెలిపారు. రాజస్థాన్ ఎన్నికలలో టోంక్ నుండి సచిన్ పైలట్ బీజేపీకి చెందిన అజిత్ సింగ్ మెహతాపై పోటీ చేస్తున్నారు.