NTV Telugu Site icon

Rajasthan: ప్రభుత్వమే ఏర్పాటు కాలేదు.. అప్పుడే యాక్షన్ మూడ్ లో బీజేపీ

New Project (35)

New Project (35)

Rajasthan: రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందే భారతీయ జనతా పార్టీ (బిజెపి) యాక్షన్ మూడ్‌లో ఉంది. అవినీతికి వ్యతిరేకంగా పార్టీ పెద్ద ఎత్తున కార్యాచరణకు సిద్ధమవుతోంది. గెహ్లాట్ ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైన అధికారిగా ఉన్న అఖిల్ అరోరా.. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రాడార్‌లో ఉన్నారు. యోజన భవన్‌లో దొరికిన నగదు, బంగారం కేసులో అతడిని విచారించవచ్చు. ఈ కేసులో చర్యలు తీసుకునేందుకు ఏసీబీ ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుస్పష్టం. అయితే ఇంకా ముఖ్యమంత్రిని ఎంపిక చేయలేకపోయింది. పలువురి పేర్లపై పార్టీలో మెదులుతూనే ఉంది. సీఎం పేరుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో గెహ్లాట్ ప్రత్యేక అధికారిని బీజేపీ టార్గెట్ చేసింది.

Read Also:Telangana BJP: ఓవైసీ ముందు ప్రమాణం చేయం.. అసెంబ్లీ బహిష్కరించాలని బీజేపీ నిర్ణయం..

విచారణకు అనుమతి కోరామని, ఇందులో ఐఏఎస్ అధికారి అఖిల్ అరోరాను విచారించాల్సి ఉందని ఏసీబీ సీనియర్ అధికారి తెలిపారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ ప్రకారం, ఏదైనా అధికారి సిఫార్సుల కోసం లేదా నిర్ణయం తీసుకోవడం కోసం మనం విచారించవలసి వస్తే, మాకు అనుమతి అవసరం. దీనికి సంబంధించి ఇప్పటివరకు మాకు ఎలాంటి ఆమోదం లభించలేదన్నారు.

Read Also:Rajasthan CM Candidate: రాజస్థాన్‌లో ఈ రోజే బీజేపీ సమావేశం.. సీఎం పదవిపై వీడని ఉత్కంఠ