NTV Telugu Site icon

Rajasthan: 700 అడుగుల లోతు బోరుబావిలో పడ్డ మూడేళ్ల బాలిక.. పదిరోజుల్లో రెండోది

Rajasthan

Rajasthan

రాజస్థాన్‌లోని కోట్‌పుత్లీలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం మూడేళ్ల బాలిక బోరుబావిలో పడిపోయింది. బోరుబావి 700 అడుగుల లోతు ఉంది. మొదట్లో దాదాపు 15 అడుగుల లోతులో ఉన్న బాలిక ఒక్కసారిగా జారి కిందకు వెళ్లింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భూపేంద్ర చౌదరి కుమార్తె చేతనా చౌదరి ఇంటి దగ్గర ఆడుకుంటున్న సమయంలో.. ప్రమాదవశాత్తు కాలు జారి తెరిచి ఉన్న బోరుబావిలో పడిపోయినట్లు అధికారులు తెలిపారు.

Read Also: Manchu Family: మంచు కుటుంబంలో మళ్లీ రచ్చ

ఈ ఘటనపై కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించగా.. బోరుబావి దగ్గర జేసీబీతో తవ్వకాలు చేపట్టారు. కాగా.. బోరు బావిలో పడ్డ చిన్నారికి బోర్‌వెల్‌లోని పైపు ద్వారా ఆక్సిజన్‌ ​​సరఫరా చేస్తున్నారు. అయితే.. బోరు బావిలో రాళ్లు ఉండటంతో బాలిక 150 అడుగుల లోతులో ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కాగా.. చిన్నారిని బయటకు తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. బోర్‌వెల్‌లో కెమెరాలు, మైక్‌లు అమర్చి.. బాలిక కదలికను పర్యవేక్షిస్తున్నారు.

Read Also: Health: వెల్లుల్లిని ఆహారంలో కాకుండా ఇలా తినండి.. రోగాలకు చెక్ పెట్టండి

కాగా.. గత పది రోజుల్లో రాజస్థాన్‌లో ఇలాంటి కేసు ఇది రెండోది కావడం గమనార్హం. డిసెంబర్ 12న దౌస్‌లో బోరు బావిలో పడ్డ ఘటనలో ఆర్యన్ అనే ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మూడు రోజుల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించినప్పటికీ.. బాలుడి ప్రాణాలతో బయటపడలేదు.

Show comments