NTV Telugu Site icon

Raja Singh: రేపు అసెంబ్లీని బహిష్కరిస్తున్నాం.. అక్బరుద్దీన్ ముందు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేయం

Rajasing 1

Rajasing 1

రేపు అసెంబ్లీని బహిష్కరిస్తున్నాం.. మా బీజేపీ ఎమ్మె్ల్యేలు ఎవరూ అక్బరుద్దీన్ ఒవైసీ ముందు ప్రమాణం చేయరని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. కాసిం రిజ్వి వారసుడు అక్బరుద్దీన్ ఓవైసీ.. ఆయన ముందు తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని అన్నారు. 15 నిమిషాలు సమయం ఇస్తే 100 కోట్ల హిందువులను చంపేస్తానని అన్న వ్యక్తి అక్బరుద్దీన్ అని గుర్తు చేశారు. దేశానికి, హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తికి ప్రోటెం స్పీకర్ గా కాంగ్రెస్ పార్టీ చేసిందని ఆరోపించారు. ఇప్పుడు ఎవరు దోస్త్, ఎవరు దుస్మన్ అర్థం అవుతుందా అని ప్రశ్నించారు.

Read Also: Free Bus Services: ఆర్టీసీ మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు ఇవే..

బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎంకి ఇచ్చిన లెక్కనే.. కాంగ్రెస్ కూడా భయపడి తమ చెయ్యిని కూడా ఎంఐఎం చేతికి ఇస్తుందని రాజాసింగ్ తెలిపారు. ఎందరో సీనియర్లు ఉన్న ఆయనే ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఉన్న, బీఆర్ఎస్ ఉన్న, టీడీపీ ఉన్న రేపు బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వాళ్ళు కాళ్లు మొక్కి నెత్తి మీద కూర్చోడానికి ప్రయత్నిస్తారని ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ఎస్ మనిషి, టిల్లు అని ఆన్న వ్యక్తి అక్బరుద్దీన్ అని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కూడా ఎంఐఎందే రాజ్యం నడుస్తుందని రాజాసింగ్ విమర్శించారు.

Read Also: Big Breaking: ఎంపీ పదవికి రాజీనామా సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి