MP Margani Bharat: తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.. అసంతృప్తి చెందే ఎమ్మెల్యేలకు ఎంపీ హితబోధ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Margani Bharat: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా దానిని స్వాగతించాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆ పార్టీలోని అసంతృప్తి ఎమ్మెల్యేలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ హితవు పలికారు. రాజమండ్రి మోరంపూడి జంక్షన్ వద్ద భరత్ మీడియాతో మాట్లాడారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పార్టీ మారుతున్న విషయాన్ని మీడియా ప్రతినిధులు ఎంపీ భరత్ దృష్టికి తీసుకు రాగా ఈ విధంగా స్పందించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎప్పుడూ ఒకటేనని.. మనల్ని నమ్ముకున్న ప్రజలకు మంచి చేయాలంటే అధికారంలో ఉండాలని, అందుకోసం ప్రజల మనసు గెలుచుకోవాలని పదేపదే చెప్పడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Read Also: CM YS Jagan: వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు.. ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
Also Read
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
‘వై నాట్ 175’ గెలుపే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి టికెట్ కేటాయింపులు చేస్తున్నారని..అలాగని టికెట్ ఇవ్వని సిట్టింగులకు అన్యాయం జరగదన్నారు. రేపు అధికారంలోకి రాగానే ఎవరైతే పార్టీ విజయానికి కృషి చేశారో వారందరికీ తగిన విధంగా గుర్తించి గౌరవిస్తారని చెప్పారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, తదితర వైసీపీ కుటుంబ సభ్యులు పెద్ద మనసు చేసుకుని ఆలోచించాలన్నారు. ఏ నియోజకవర్గానికీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేయలేదని, కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేయించారన్న విషయాన్ని మరిచిపోకూడదని ఎంపీ భరత్ అన్నారు.
తాజావార్తలు
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!