Baahubali The Eternal War: బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి దర్శకధీరుడు రాజమౌళి. ఆయన కొత్త సినిమా 2027లో థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇంతకీ ఆ సినిమా పేరు ఎంటో తెలుసా.. బాహుబలి ది ఎటర్నల్ వార్. ఈ సినిమాకు ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తారు. జక్కన్న ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా 2027లో థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమాను యానిమేషన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు రాజమౌళి తెలిపారు.
READ ALSO: Wedding Season: దేశవ్యాప్తంగా 46 లక్షల పెళ్లిళ్లు.. ఏకంగా రూ. 6.5 లక్షల కోట్ల వ్యాపారం..
దేవ రాక్షసుల యుద్ధంలో బాహుబలి ప్రమేయంతో మహావతార్ నరసింహ లాంటి యానిమేషన్ సినిమా రాబోతుందని రాజమౌళి వెల్లడించారు. జక్కన్న ప్రకటన తర్వాత ప్రేక్షకుల్లో ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. బాహుబలి సినిమా భాషా సరిహద్దులు, దేశాల సరిహద్దును కూడా బద్ధలు కొట్టి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అలాంటి బాహుబలి పేరుతో రాబోతున్న బాహుబలి ది ఎటర్నల్ వార్ అనే సినిమా గురించి ఇప్పటి నుంచే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. బాహుబలి సినిమా థియేటర్‌లో విడుదలై 10 ఏళ్లు అయిన సందర్భంగా అక్టోబర్ 31 న బాహుబలి రెండు పార్ట్‌లు కలిపి ఒక సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే జక్కన్న – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న SSMB 29 సినిమా గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబును జక్కన్న ఎలా చూపించబోతున్నారో, వాళ్లిద్దరూ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా థియేటర్‌లో ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందో అని సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
READ ALSO: Naga Chaitanya: నాగ చైతన్య లైఫ్‌లో మిస్ అయిన అమ్మాయి ఎవరో తెలుసా?
