Site icon NTV Telugu

ATM Thief: ఏటీఎం సెంటర్ల వద్ద మాటేస్తాడు.. కార్డులను మార్చి డబ్బు కొట్టేస్తాడు!

Atm Thief

Atm Thief

అవును.. అతడు ఏటీఎంలను ఏమార్చుతాడు.. చదువురాని వాళ్లని టార్గెట్ చేస్తాడు.. ఏటీఎం నుంచి డబ్బు తీసి ఇస్తానని నమ్మించి, తర్వాత అవతలి వ్యక్తి ఏటీఎంను కొట్టేసి మరోచోట డబ్బులు నొక్కేస్తాడు. ఇలా ఒకటా రెండా.. ఏకంగా 300కు పైగా ఏటీఎం కార్డులను నొక్కేసి లక్షలాది రూపాయలు కొట్టేసాడు. అతడే విద్యాసాగర్ అనే మోసగాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో దొంగతనాలకు పాల్పడినట్లు రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు కనుగొన్నారు.

ఒక కేసులో నిందితుడిని పట్టుకొని ఆరా తీయడంతో జరిగిన ఏటీఎం మోసాల గుట్టు రట్టు అయింది. విద్యాసాగర్ ఏటీఎం కౌంటర్ వద్ద వేచి ఉంటాడు. ఏటీఎంలో డబ్బులు తీసి ఇవ్వాలని కోరేలా ప్లాన్ చేస్తాడు. విద్యాసాగర్ ఏటీఎం కార్డు తీసుకుని.. పిన్ నంబర్ అడిగి తెలుసుకుంటాడు. తర్వాత తన జేబులో ఉన్న బ్యాంకు ఏటీఎం కార్డు బయటకు తీసి, అవతలి వ్యక్తి ఏటీఎం కార్డును తన జేబులో వేసుకుంటాడు. ఏటీఎం నుంచి డబ్బులు రావడం లేదని అవతలి వ్యక్తికి చెబుతాడు. కార్డు దారుడు వెళ్లిపోయిన తరువాత మరో ఏటీఎం. నుండి డబ్బులు మొత్తం కాజేస్తున్నాడు.

Also Read: Chinta Mohan: అమరావతిపై 20 జిల్లాల్లో వ్యతిరేకత ఉంది.. రాష్ట్ర పరిస్థితి బాలేదు!

విద్యాసాగర్ ఇప్పటివరకు 300కు పైగా ఏటీఎం కార్డుల నుండి డబ్బులు కొట్టేశాడు. ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు అతడిపై నిఘా పెట్టారు. మోసగాడు విద్యాసాగర్‌ను పోలీసులు తెలివిగా వలపన్ని పట్టుకున్నారు. ఈ మేరకు రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు విద్యాసాగర్‌ను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచి జైలుకు పంపారు.

Exit mobile version