Site icon NTV Telugu

Raja Singh : కొత్త అధ్యక్షుడిని వెంటనే నియమించండి.. హైకమాండ్‌కు రాజాసింగ్‌ డిమాండ్‌

Mla Raja Singh

Mla Raja Singh

Raja Singh : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ నేత రాజాసింగ్ పార్టీ అధిష్టానాన్ని కీలకంగా కోరారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని వెంటనే నియమించాలని స్పష్టంగా తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన సమావేశాలు కేవలం టైమ్ పాస్ అయిపోయాయన్న ఆవేదన వ్యక్తం చేశారు. రేపు మరోసారి అలాంటి సమావేశమే జరుగబోతుందంటూ తీవ్రంగా విమర్శించారు. ఇదిలా ఉండగా, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై గడువు మరింత పెరిగే అవకాశం ఉంది. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక తర్వాతే రాష్ట్రాధ్యక్షుడిపై స్పష్టత రానుంది. అయితే జాతీయ స్థాయిలో పార్టీలో మార్పులు వీలైనంత త్వరగా పూర్తిచేయాలని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. జాతీయ అధ్యక్షుడి ఎంపిక అనంతరం పార్టీ కార్యకలాపాలు, పాలనాపరమైన వ్యూహాలపై దృష్టి పెట్టే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ పదవికి అనువైన వ్యక్తి ఎంపికపై అగ్రనేతల్లో స్పష్టత రాకపోవడంతో ఆలస్యం జరుగుతోంది. ఇదే విషయంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) నేతలతో కూడా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

RCB vs CSK: రఫ్పాడించిన ఆర్సీబీ బ్యాటర్లు.. కింగ్ కోహ్లీ, షెపర్డ్‌, బెతెల్‌ తుఫాను ఇన్సింగ్స్!

Exit mobile version