Site icon NTV Telugu

Raja Singh : దమ్ముంటే నా మీద అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేయాలి

Rajasingh

Rajasingh

దాదాపు ఏడాది తరువాత బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అడుగుపెట్టారు గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌. సస్పెషన్ ఎత్తేసి, సీటు కేటాయించడంతో రాజాసింగ్ భారీ ర్యాలీగా పార్టీ కార్యాలయానికి వచ్చారు. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్‌ మాట్లాడుతూ.. దమ్ముంటే నా మీద అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేయాలన్నారు. ఎంఐఎంను పెంచి పోషించింది కాంగ్రెస్ అని ఆయన ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్‌ఎస్‌లు ఒకటేనని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Adipurush : ఆదిపురుష్ టెలివిజన్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్…

అంతేకాకుండా.. ‘నా నియోజక వర్గం లో పార్టీ ఎవరికి టికెట్ ఇచిహిన సపోర్ట్ చేస్తా అని చెప్పిన. విక్రమ్ గౌడ్ నాకు ప్రచారం చేస్తారు. నాకు హ్యాట్రిక్ విజయం ఖాయం. నా పైన సస్పెన్షన్ ఎత్తేవేసి నాకు టికెట్ ఇచ్చినందుకు బీజేపీ హై కమాండ్ కు ధన్యవాదాలు. పార్టీ ఎక్కడ ప్రచారం చేయమన్న చేస్తాను. తెలంగాణ లో బీజేపీ అధికారం లోకి రావడం ఖాయం. బీజేపీ గ్రాఫ్ తగ్గిందనే ది ప్రచారం మాత్రమే’ అని రాజాసింగ్‌ వ్యాఖ్యానించారు. కాగా ఓ మతాన్ని కించపరిచే విధంగా రాజాసింగ్ కామెంట్స్ చేశారన్న ఆరోపణలతో గతేడాది రాజాసింగ్ ను బీజేపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. త్వరలో ఎన్నికలు జరగనున్న క్రమంలో ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ బీజేపీ ఇవాళ నిర్ణయం తీసుకుంది.

Also Read : India’s aid to Gaza: గాజాకు భారత్ భారీ సాయం.. 6.5 టన్నుల వైద్య సామాగ్రి..

Exit mobile version