Site icon NTV Telugu

The Raja Saab : థియేటర్ రన్ ముగించిన రాజాసాబ్.. ఫైనల్ గా నష్టం ఎంత?

The Rajasaab

The Rajasaab

ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమాకు భారీ నష్టాలు వచ్చినట్టుగా ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. మారుతి దర్శకత్వంలో హార్రర్ ఫాంటసీ డ్రామాగా సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లోకి వచ్చిన రాజాసాబ్.. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ప్రభాస్ క్రేజ్‌కు టాక్‌తో సంబంధం లేకుండా.. ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ. 112 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కానీ, ఈ సినిమాకు మిక్స్ టాక్ రావడంతో.. ఫైనల్ రిజల్ట్‌ను అది ఫ్లాప్‌గా మార్చేసింది. ఫస్ట్ వీక్‌ వసూళ్లు బాగానే ఉన్నప్పటికీ.. ఆ జోరు తర్వాత కొనసాగించలేకపోయింది. దాంతో రెండు వారాల్లోనే ఈ సినిమా థియేటర్ క్లోజింగ్‌కు వచ్చేసింది.

Also Read : Sai Pallavi : ఆ స్టార్ హీరో వారసుడికి సాయి పల్లవి హిట్ ఇస్తుందా?

ట్రేడ్ లెక్కల ప్రకారం.. మొదటి వారంలో రూ. 130 కోట్ల నెట్ వసూలు చేయగా, ఇప్పటి వరకు టోటల్ ఇండియా నెట్ కలెక్షన్స్ రూ. 142 కోట్లకు చేరుకుంది. గ్రాస్ పరంగా చూస్తే.. ఫస్ట్ వీక్‌లో మేకర్స్ రూ. 238 కోట్లు రాబట్టినట్టుగా అధికారిక ప్రకటన చేశారు. ఓవరాల్‌గా చూస్తే.. రూ. 250 కోట్ల గ్రాస్ మార్క్ టచ్ చేసినట్టుగా ట్రేడ్ అంచనా. కానీ, రాజాసాబ్ బడ్జెట్, బిజినెస్ లెక్కల ప్రకారం భారీగానే నష్టాలు వచ్చినట్టుగా చెబుతున్నారు. థియేట్రికల్ వెర్షన్ 50 నుంచి 60 శాతం రికవరీ చేసినప్పటికీ.. మేకర్స్‌కు సుమారు వంద కోట్ల నష్టం వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా ట్రేడ్ వర్గాల విశ్లేషిస్తున్నాయి. దీంతో.. ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ కెరీర్లో భారీ నష్టాలు తెచ్చిన సినిమాగా రాజాసాబ్ నిలిచినట్టే. రిలీజ్ కు ముందు మా రెబల్ ఫ్యాన్స్ కు భారీ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన మారుతీ ప్లాప్ రూపంలో గిఫ్ట్ ఇచ్చాడని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.

Exit mobile version