బాహుబలితో ఇండియన్ సినిమా దశ దిశను మార్చిన ప్రభాస్.. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా దూసుకుపోతున్నాడు. ఆయనతో సినిమాలు చేయాలంటే మినిమమ్ రూ. 500 కోట్లు బడ్జెట్ ఉండాల్సిందే. ప్రభాస్ పారితోషికం రూ. 100 నుంచి రూ. 150 కోట్ల వరకు అందుకుంటున్నాడు. అసలు ఆయన సినిమా విడుదలవుతుందంటే చాలు పాన్ ఇండియా వైడే కాదు వరల్డ్ వైడ్ ఆడియెన్స్ థియేటర్లకు పరుగులు పెడతారు. అంతటి స్టార్‌డమ్ ఉన్న డార్లింగ్, ఈసారి వింటేజ్ వైబ్ ఇచ్చేలా రాజాసాబ్‌తో కొత్త జానర్ ట్రై చేశాడు.
Also Read : Pongal Fight : రాజాసాబ్ vs శంకర్ వరప్రసాద్.. అసలైన విన్నర్ ఎవరు?
మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది రాజాసాబ్’ సినిమా సోషియో ఫాంటసీ డ్రామాగా రూపొందింది. మైండ్ గేమ్ ఛాలెంజింగ్‌గా వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తోంది. నైజాం ప్రీమియర్స్ పరంగా కాస్త దెబ్బ పడిన ఓవరాల్ మాత్రం సాలిడ్ స్టార్టప్ అందుకుంది రాజాసాబ్. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 112 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. దీంతో.. ప్రభాస్ కెరీర్లో వంద కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన 6వ సినిమాగా రాజాసాబ్ రికార్డ్ నమోదు చేసింది. మిక్డ్స్ టాక్ వచ్చిన సరే ఎక్కడా తగ్గకుండా దూసుకెళ్తున్నాడు రాజాసాబ్. ఇక ఈ సినిమా ఫస్ట్ వీక్ రన్ ఫినిష్ చేసుకుంది. రిలీజ్ అయిన మూడు రోజులకు గాను రూ. 183 కోట్ల గ్రాస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక నేటి నుండి వరుస సెలవలు కావడంతో బుకింగ్స్ లో జోరు చూపిస్తూ ఈ రోజు ముగిసేనాటికి రూ. 200 కోట్ల మార్క్ అందుకుంటుందనీ ట్రేడ్ అంచనా వేస్తుంది.
