టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రాల్లో ఒకటి ‘రాజాసాబ్’. మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను టాలీవుడ్ బడా చిత్రాల నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ పై గత కొంత కాలంగా అనేక వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాపై జరుగుతున్న వివిధ ప్రచారాలపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చారు.
Also Read : Prabhas : రెబల్ స్టార్ ‘ప్రభాస్’ రాబోయే రెండేళ్లు డైరీ ఫుల్
రాజాసాబ్ చిత్ర నిర్మాత విశ్వప్రసాద్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ‘ గత కొంత కాలంగా మా సినిమా వ్యాపారం గురించి చాలా చర్చ జరుగుతోంది. మా సినిమాల అంతర్గత ఖర్చులు లేదా బిజినెస్ వివరాలను మేము ఎప్పడు బహిరంగంగా చర్చించము. రిలీజ్ కు ముందు అలా చేయడం మా ఫ్యాన్స్ తో పాటు థియేటర్స్ పై ప్రభావం చూపుతుంది. సినిమా విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ గణాంకాలను అధికారికంగా పంచుకుంటాము. సినిమా రంగం ఎప్పటికప్పుడు మారుతూ వస్తోంది. ఈ రోజుల్లో నాన్-థియేట్రికల్ మార్కెట్ ఎప్పుడు ఒకేలా ఉండడం లేదు. స్టార్ కాంబినేషన్స్ ఉన్నా కూడా అనుకున్న ధర పలకడం లేదు. ఈ దశలో కూడా మా సినిమా అత్యధిక నాన్-థియేట్రికల్ ధర పలికింది. ఇతర సినిమాలతో మా సినిమాలను పోల్చి చూడకండి. రాజాసాబ్ సినిమా థియేటర్లలో గర్జించడానికి రెడీగా ఉంది. ఈ భారీ హారర్-ఫాంటసీ చిత్రం థియేటర్స్ లో సంచలనం సృష్టిస్తుంది’ అని ట్వీట్ చేశారు.
There’s a lot of noise around the business of our biggest film.
We don’t discuss internal spends or numbers publicly. What truly matters to us and the fans is the theatrical impact. Post release, we will officially share the worldwide box-office figures.
Cinema moves in phases.…
— Vishwa Prasad (@vishwaprasadtg) December 21, 2025
