సద్దుమణిగిందని అనుకుంటున్న హీరో రాజ్ తరుణ్-లావణ్య ఎపిసోడ్ మరోసారి తెరపైకి వచ్చింది. గత ఏడాది మొదలైన రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రా మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇప్పటికీ కొనసాగుతోంది. గతంలో వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని, కేసులు కూడా పెట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితం రాజ్ తరుణ్‌పై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటున్నట్లు లావణ్య వెల్లడించింది. అయితే, అంతలోనే రాజ్ తరుణ్-లావణ్య కేసులో ఊహించని మలుపు తెరపైకి వచ్చింది. లావణ్యపై రాజ్ తరుణ్ తల్లిదండ్రులు దాడి చేయించినట్లు లావణ్య ఆరోపిస్తోంది. అయితే, లావణ్య తమ కుమారుడి ఇంట్లోకి తమను రానివ్వకుండా బయటకు గెంటేసిందని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
Odela 2: రిలీజ్ కు ముందే గట్టి సౌండ్ చేస్తున్న ఓదెల 2
తాజాగా, లావణ్య మీడియాతో మాట్లాడుతూ, “రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కొందరితో కలిసి ఇంట్లోకి వచ్చి నాపై దాడి చేశారు. కోర్టులో కేసు ఉన్నప్పటికీ, వారు నన్ను ఇంటి నుంచి గెంటడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఇల్లు రాజ్ తరుణ్ పేరుపైనే ఉంది, కానీ మేము సహజీవనం మొదలుపెట్టినప్పుడే నా ప్రమేయం లేకుండా ఈ ఇంటిని అమ్మకూడదని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు నాకు ఈ ఇంటిపై హక్కు ఉంది. రాజ్ తరుణ్ భార్యగా నేను ఇక్కడ నివసిస్తున్నాను. మా అత్తమామలు మంచిగా వచ్చి ఉంటే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ నన్ను ఈ ఇంటి నుంచి గెంటడానికి వారు ప్రయత్నిస్తున్నారు,” అని చెప్పుకొచ్చింది. తన నంబర్లు బ్లాక్ చేయడంతో, స్నేహితురాలి నంబర్ నుంచి వారిని ఇంటికి వచ్చి నివసించమని అడిగానని లావణ్య తెలిపింది. అయితే, వారు రాజ్ తరుణ్ మాటలు విని, తనను ఇంటి నుంచి గెంటివేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించింది.