AP Liquor Scam Case: జడ్జి ఎదుట కంటతడి పెట్టిన రాజ్ కేసిరెడ్డి.. రూ.11 కోట్లపై కోర్టు కీలక ఆదేశాలు..!
- ఏసీబీ కోర్టుకు లిక్కర్ కేసు ఏ1 రాజ్ కేసిరెడ్డి..
- న్యాయమూర్తి ఎదుట కంటతడి పెట్టిన కేసిరెడ్డి..
- తనకు సంబంధం లేకపోయినా రూ.11 కోట్లు లింక్ పెడుతున్నారు..
- ఆ 11 కోట్ల నగదుపై ఉన్న నంబర్స్ రికార్డ్ చేయాలని విజ్ఞప్తి..
- ఆ నగదును ఫోటోగ్రాఫ్‌లు తీయాలని కోర్టు ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డిని విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు సిట్ పోలీసులు.. అయితే, న్యాయమూర్తి ఎదుట కంట తడి పెట్టారు రాజ్ కేసిరెడ్డి.. తనకు సంబంధం లేకపోయినా 11 కోట్ల రూపాయలు తనవే అని సిట్ లింకులు పెడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.. ఆ 11 కోట్ల నగదుపై ఉన్న నంబర్స్ రికార్డ్ చేయాలని న్యాయమూర్తిని కోరాడు కేసిరెడ్డి.. తాను 2024 జూన్ లో ఆ డబ్బు వరుణ్ కి ఇచ్చినట్టు చెబుతున్నారని.. ఆ నోట్లు RBI ఎప్పుడు ముద్రించింది అనేది చూడటానికి నంబర్స్ రికార్డ్ చేయాలని విజ్ఞప్తి చేశాడు..
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
45 ఏళ్ల క్రితం కొన్న ఆస్తులకు నేను దానికి బినామీ అంటున్నారని వాపోయాడు రాజ్ కేసిరెడ్డి.. తన వయసు 43 అని.. తాను పుట్టక ముందే వేరే వారికి నేను బినామీ అయ్యనా? అని కోర్టు ఎదుట కంటతడి పెట్టాడు కేసిరెడ్డి.. 11 కోట్ల నగదు బాక్సులు తానే అందించినట్టు చెబుతున్నారని.. ఫింగర్ ప్రింట్స్ ఉండాలి కదా..? దాన్ని పరిశీలించాలని కోరాడు.. ఇక, ఛార్జిషీట్ వేసిన సమయంలో మాపై దర్యాప్తు ముగిసినట్టు పీపీ కోర్టులో చెప్పారని.. ఇప్పుడు కొత్త కొత్త విషయాలు మాకు సంబంధం అంటున్నారని.. ఈ విషయాలు పరిశీలించాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.. అయితే, సిట్ సీజ్ చేసిన ఆ రూ.11 కోట్లపై ఏసీబీ కోర్టు జడ్జి కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఆ నగదును ఫోటోగ్రాఫ్‌లు తీయాలని సిట్‌కి ఆదేశాలు జారీ చేశారు విజయవాడలోని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి..
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!