Site icon NTV Telugu

AP Liquor Scam Case: జడ్జి ఎదుట కంటతడి పెట్టిన రాజ్‌ కేసిరెడ్డి.. రూ.11 కోట్లపై కోర్టు కీలక ఆదేశాలు..!

Raj Kasireddy

Raj Kasireddy

AP Liquor Scam Case: ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్‌ కేసిరెడ్డిని విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు సిట్‌ పోలీసులు.. అయితే, న్యాయమూర్తి ఎదుట కంట తడి పెట్టారు రాజ్‌ కేసిరెడ్డి.. తనకు సంబంధం లేకపోయినా 11 కోట్ల రూపాయలు తనవే అని సిట్ లింకులు పెడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.. ఆ 11 కోట్ల నగదుపై ఉన్న నంబర్స్ రికార్డ్ చేయాలని న్యాయమూర్తిని కోరాడు కేసిరెడ్డి.. తాను 2024 జూన్ లో ఆ డబ్బు వరుణ్ కి ఇచ్చినట్టు చెబుతున్నారని.. ఆ నోట్లు RBI ఎప్పుడు ముద్రించింది అనేది చూడటానికి నంబర్స్ రికార్డ్ చేయాలని విజ్ఞప్తి చేశాడు..

Read Also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

45 ఏళ్ల క్రితం కొన్న ఆస్తులకు నేను దానికి బినామీ అంటున్నారని వాపోయాడు రాజ్‌ కేసిరెడ్డి.. తన వయసు 43 అని.. తాను పుట్టక ముందే వేరే వారికి నేను బినామీ అయ్యనా? అని కోర్టు ఎదుట కంటతడి పెట్టాడు కేసిరెడ్డి.. 11 కోట్ల నగదు బాక్సులు తానే అందించినట్టు చెబుతున్నారని.. ఫింగర్ ప్రింట్స్ ఉండాలి కదా..? దాన్ని పరిశీలించాలని కోరాడు.. ఇక, ఛార్జిషీట్‌ వేసిన సమయంలో మాపై దర్యాప్తు ముగిసినట్టు పీపీ కోర్టులో చెప్పారని.. ఇప్పుడు కొత్త కొత్త విషయాలు మాకు సంబంధం అంటున్నారని.. ఈ విషయాలు పరిశీలించాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.. అయితే, సిట్ సీజ్ చేసిన ఆ రూ.11 కోట్లపై ఏసీబీ కోర్టు జడ్జి కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఆ నగదును ఫోటోగ్రాఫ్‌లు తీయాలని సిట్‌కి ఆదేశాలు జారీ చేశారు విజయవాడలోని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి..

Exit mobile version