మండుటెండల్లో వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. ఏపీలో హిందూపురం, పరిగి, కదిరి మండలాల్లో వర్షం కురుస్తోంది. అనంతపురం, గుత్తి మండలంలో తెల్లవారుజాము నుంచి వర్షం పడుతోంది.
Also Read:Ramagiri MPP Election: ఎంపీపీ ఇస్తామంటూ టీడీపీ నేతలు ప్రలోభ పెట్టారు.. వీడియో రిలీజ్ చేసిన ఎంపీటీసీ!
అనంతపురం జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలో నీట మునిగాయి. పై ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం పెద్ద ఎత్తున రావడంతో ఒక్కసారిగా ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు అవస్థలు పడ్డారు. అనంతపురం రూరల్ పరిధిలోని కక్కలపల్లి కాలనీ పంచాయతీ ప్రజాశక్తి నగర్, అలాగే రాప్తాడు మండల పరిధిలోని కందుకూరు గ్రామ సమీపంలో ఉన్న సిపిఐ కాలనీలో నీరు పెద్ద ఎత్తున చేరాయి. ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమా ఒక సిబ్బంది సకాలంలో వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. నీటి ప్రవాహం అధికమవుతుండడంతో ఇళ్లల్లో ఎవరు ఉండకూడదని హెచ్చరికలు జారీ చేశారు. నీటి ప్రవాహం తగ్గించడానికి చర్యలు చేపట్టారు.
Also Read:Peddireddy Ramachandra Reddy: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా కుటుంబ సభ్యులపై కేసు
హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలుజిల్లాల్లో వర్షాలు కురుస్తు్న్నాయి. నగరంలో పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహిదీపట్నం, అత్తాపూర్, ఫలక్ నుమా, అల్వాల్, సికింద్రాబాద్, ఓల్డ్ సిటీ, చింతల్, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఆఫీసులకు, ఇతర పనుకు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో కలత చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
