టీమిండియా మాజీ క్రికెటర్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరైన సురేష్ రైనా ఇప్పుడు మళ్లీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రైనా ముందుగా శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్వహించే లంక ప్రీమియర్ లీగ్ లో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాట్లు తెలుస్తోంది.
Also Read : Manipur violence: మణిపూర్ నిర్వాసితులకు 15 రోజుల్లో తాత్కాలిక గృహాలు
రేపు (బుధవారం) జరిగే ఎల్‌పీఎల్ 2023 సీజన్ ఆటగాళ్ల వేలం జాబితాలో రైనాకు చోటు దక్కింది. ఈ మేరకు జులై 31 నుంచి ఐదు జట్లు పోటీ పడే లీగ్ కోసం వేలంలోకి వచ్చిన అంతర్జాతీయ, దేశవాళీ క్రికెటర్ల జాబితాను శ్రీలంక క్రికెట్ అసోసియేషన్ విడుదల చేసింది. 36 ఏళ్ల సురేశ్ రైనా భారత్ తో పాటు ఐపీఎల్ లో సత్తా చాటాడు. ముఖ్యంగా ఐపీఎల్ లో తన బ్యాటింగ్ మెరుపులతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
Also Read : Lavanya Tripati : పెళ్లి చేసుకోవడానికి కండిషన్ పెట్టిన లావణ్య త్రిపాఠి..?
చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్ తరఫున ఐపీఎల్‌లో 205 మ్యాచ్‌లు ఆడిన రైనా 5 వేల 500కు పైచిలుకు పరుగులు సాధించాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన ఆటగాళ్లు విదేశీ లీగుల్లో ఆడొచ్చు అని చెప్పింది. రెండేళ్ల నుంచి ఆటకు దూరమైన రైనా ప్రస్తుతం క్రికెట్ కామెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. శ్రీలంక లీగ్ కోసం అతను మళ్లీ బ్యాట్ పట్టుకోనున్నాడు. దీంతో సురేష్ రైనా బ్యాటింగ్ ను మళ్లీ చూసే భాగ్యం మాకు దొరికింది అని చిన్న తలా అభిమానులు అనుకుంటున్నారు.