NTV Telugu Site icon

India vs Pakistan: భారత్- పాక్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్.. ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..?

Ind Vs Pak

Ind Vs Pak

India vs Pakistan: టీ20 ప్రపంచకప్ 2024లో హై వోల్టేజ్ క్రికెట్ స‌మ‌రానికి రంగం సిద్ధమైంది. ఈ మెగా టోర్నమెంట్లో భాగంగా రేపు (జూన్ 9) న్యూయ‌ర్క్ వేదిక‌గా టీమిండియా- పాకిస్తాన్ జ‌ట్లు మధ్య కీలక పోరు జరగబోతుంది. ఈ చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ ను వీక్షించేందుకు రెండు దేశాలకు చెందిన క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల ఫ్యాన్స్ కు వాతావరణ శాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే ఛాన్స్ ఉంది అని పేర్కొనింది. ఆదివారం నాడు మ్యాచ్ జరిగే టైంలో న్యూయర్క్‌లో వర్షం కురిసే అవకాశం ఉందని ‘అక్యూ వెదర్’ రిపోర్ట్ వెల్లడించింది.

Read Also: Rajamouli: రామోజీరావు పార్థివదేహం వద్ద రాజమౌళి కంటతడి.. భారత రత్న ఇవ్వాలంటూ!

కాగా, అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10. 30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలు) ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. టాస్ వేసే సమయంలో 40 శాతం నుంచి 50 శాతం వరకు వర్షం పడే ఛాన్స్ ఉందని అక్యూ వెదర్ తమ రిపోర్ట్‌లో ప్రకటించింది. ఇక, వర్ష సూచన మధ్యాహ్నం 1 గంట సమయానికి 10 శాతానికి తగ్గిపోయి.. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ 40 శాతానికి పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్ క్యాన్సిల్ అయితే, ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తోంది. ఈ మ్యాచ్ సమయంలో వాన పడితే ఎంతో కాలంగా వేచి ఉన్న క్రికెట్ అభిమానుల ఆశ మాత్రం అడియాశలు అయినట్లే అని క్రిడా పండితులు అంటున్నారు.