NTV Telugu Site icon

IND vs BAN: వరుణుడి ఆటంకం.. ముందుగానే ముగిసిన ఆట

Ind Vs Ban

Ind Vs Ban

ఈరోజు (శుక్రవారం) నుంచి కాన్పూర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. అయితే.. ఈ మ్యాచ్ ముగియాల్సిన సమయం కంటే ముందుగానే ముగిసింది. కారణమేంటంటే.. వర్షం ఆటంకం కలిగించింది. స్టేడియం వర్షం పడి కొంత చిత్తడిగా ఉంటడంతో ఆట ఒక గంట ఆలస్యంగా మొదలైంది. లంచ్ విరామం తర్వాత కొంతసేపు మ్యాచ్ జరిగింది. ఇంతలో మళ్లీ వర్షం పడింది. చాలా సేపటి వరకూ వర్షం తగ్గకపోవడంతో తొలి రోజును ఆటను అంపైర్లు ముగించారు. తొలి రోజు కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. మ్యాచ్ ముగిసే సమయానికి బంగ్లా స్కోరు 107/3 ఉంది.

Read Also: Japan: జపాన్ కొత్త ప్రధానిగా షిగేరు ఇషిబా ఎన్నిక..

టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ఎంచుకోగా.. బంగ్లాదేశ్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు షద్మాన్ ఇస్లామ్ (24), జాకీర్ హసన్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ నజ్ముల్ శాంటో (31) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం క్రీజులో మొమినుల్ హక్ (40*), ముష్ఫిఖర్ రహీం (6*) ఉన్నారు. భారత్ బౌలర్లలో ఆకాశ్ దీప్ 2 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్‌కు ఒక వికెట్ దక్కింది.

Read Also: Agniveers: బ్రహ్మోస్ ఏరోస్పేస్ విభాగాలలో అగ్నివీరులకు 15 శాతం రిజర్వేషన్లు..

ఈ మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్ అశ్విన్ సరికొత్త రికార్డు సాధించాడు. ఆసియాలో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత్ బౌలర్‌గా నిలిచాడు. అనిల్ కుంబ్లే రికార్డును బ్రేక్ చేశాడు. అనిల్ కుంబ్లే 419 వికెట్లు తీయగా.. తాజాగా వికెట్ సాధించడంతో అశ్విన్ 420 వికెట్లు సాధించాడు. ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో ముత్తయ్య మురళీ ధరన్ (612) వికెట్లు తీశాడు.