Site icon NTV Telugu

David Warner: మ్యాచ్ మధ్యలో వర్షం.. గ్రౌండ్ స్టాఫ్‌కు సహాయం చేసిన డేవిడ్ భాయ్..

David Warner

David Warner

David Warner: ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ అంటే అందరికి అభిమానమే. తన అద్భుతమైన బ్యాటింగ్ తోనే కాకుండా.. తన హెల్పింగ్ నేచర్ తో కూడా అభిమానులను అలరిస్తాడు. అయితే తాజాగా.. ఈసారి ఏకంగా అభిమానుల మనసులనే గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మధ్యలో వర్షం పడింది. ఆ సమయంలో గ్రౌండ్ సిబ్బంది కవర్లు తీసుకుని స్టేడియంలోకి వస్తుంటే వారికి డేవిడ్ వార్నర్ సహాయం చేశాడు. దీనిపై అభిమానులు డేవిడ్ భాయ్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో.. శ్రీలంక టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే 33వ ఓవర్‌ వద్ద వర్షం పడడంతో మ్యాచ్‌ను కొంతసేపు నిలిపివేయాల్సి వచ్చింది. ఈ సమయంలో వార్నర్ వారికి సహాయం చేసి హృదయాన్ని గెలుచుకునే పని చేశాడు.

Read Also: Telangana: బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌.. కీలక నేత రాజీనామా

డేవిడ్ వార్నర్ వర్షంలో కవర్లు లాగుతున్న ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఫోటోపై అభిమానులు స్పందిస్తూ వార్నర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక నెటిజన్ ఏమని రాశాడంటే.. “నిజమే. అతని మెంటాలిటీ, క్యారెక్టర్ అంటే నాకు ఇష్టం. అతను స్వచ్ఛమైన ఆత్మ ఉన్న వ్యక్తి అని కామెంట్ చేశాడు. మరొక వినియోగదారుడు, “అతను మంచి వ్యక్తి, ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి ఇష్టపడతాడని రాసుకొచ్చారు.

Read Also: Eye Care Tips: కంటిచూపు మందగిస్తుందా.. మెరుగుపడాలంటే ఏ ఆహారపదార్థాలు తినాలి..?

ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడగా.. శ్రీలంకతో మూడో మ్యాచ్ ఆడుతుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ డేవిడ్ వార్నర్ పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయాడు. ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 41 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లో కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఇప్పుడు శ్రీలంకపై ఎలాంటి ప్రదర్శన చూపిస్తాడనే దానిపై అందరి దృష్టి ఉంది.

Exit mobile version