NTV Telugu Site icon

Delhi: ఢిల్లీలో పలుచోట్ల వర్షం.. వేడి నుంచి ఉపశమనం

Rain

Rain

గత కొద్ది రోజులుగా వేడి గాలులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న హస్తిన వాసులకు శుక్రవారం ఉపశమనం లభించింది. పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అలాగే హర్యానాలోని గురుగ్రామ్‌లో కూడా భారీ వర్షం కురుస్తోంది. దీంతో వేడి, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఊరట లభించింది. వాతావరణం చల్లబడడంతో జనాలు ఊపిరి పీల్చుకుంటున్నారు. వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో ప్రజలు ఉల్లాసం పొందుతున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రుతుపవనాలు జూన్ 30 నాటికి ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ను తాకుతాయని ముందుగా ఐఎండీ అంచనా వేసింది.

ఇది కూడా చదవండి: AP Crime: ఈపురుపాలెంలో మహిళ హత్య.. బాధిత కుటుంబాన్ని కలవాలని హోంమంత్రికి సీఎం ఆదేశం

శుక్రవారం ఢిల్లీలో ఆకాశం మేఘావృతమైంది. ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెల్సియస్ దగ్గర స్థిరపడింది. మొత్తానికి చాలా రోజుల నుంచి వేడి గాలులతో ఇబ్బంది పడుతున్న ప్రజలు చల్లదనంతో సేదదీరుతున్నారు. ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో చల్లని వాతావరణం ఏర్పడింది.

ఇది కూడా చదవండి: OYO: ఓయోలో యువతి, యువకుడి మృతదేహాలు..అసలేం జరిగింది..?