NTV Telugu Site icon

HYD Rains: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం.. చల్లబడిన నగరం

Telangana Rains

Telangana Rains

హైదరాబాద్‌(Hyderabad) నగరంలోని పలు చోట్ల మళ్లీ వర్షం కురుస్తోంది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధానిలో మధ్యహ్నం నుంచి వర్షం మొదలైంది. భాగ్యనగరంలోని బోయిన్ పల్లి, జూబ్లీహిల్స్, ముసాపేట, ఎర్రగడ్డ, మధురానగర్, యూసఫ్ గూడ ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతోంది. మిగతాప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.

READ MORE: Ap Child Welfare Commission Chairman: భ్రూణ హత్యలు ఆపండి..పిల్లలు వద్దనుకుంటే మాకు అప్పగించండి

కాగా.. మరోవైపు వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. ఆదివారం రోజు నైరుతి రుతుపవనాలు అండమాన్ చేరుకున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఆదివారం వర్షం కురిసింది. సోమవారం మధ్యహ్నం నుంచి మళ్లీ మొదలైంది. వర్షాల కారణంగా చాలా చోట్ల రోడ్లు చెరువులుగా మారడంతో పాటు డ్రెయిన్లు నీటితో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు కూడా సూచనలు జారీ చేశారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. దీంతోపాటు రోడ్లపై నీటి ఎద్దడిని తొలగించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సిబ్బందిని ఆదేశించారు. పైన తెలిపిన ప్రదేశాలకు వెళ్లే ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు. అంతే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.