Site icon NTV Telugu

Rains In AP : అకాల వర్షం.. ముగ్గురు మృతి.. పంటలు నష్టం

Rain In Ap

Rain In Ap

అకాల వర్షాలు ఏపీలో బీభత్సం సృష్టిస్తున్నాయి. నిన్న రాత్రి పిడుగులు పడి కడప గుంటూరు ప్రకాశం జిల్లాలో ముగ్గురు చనిపోయారు. కడప గుంటూరు జిల్లాల్లో పిడుగుపాటుకు వందలాది మేకలు గొర్రెలు మృత్యువాత పడ్డాయి. కర్నూలు జిల్లాల్లో వందలాది ఎకరాల్లో ఆరబెట్టిన మిర్చి తడిసి నాశనం అయిపోయింది. అంతేకాకుండా.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో పొలాల్లో మినుము ఉండటంతో అక్కడి రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు ఎక్కువైతే చేతికొచ్చిన మినప పంట చేజారి పోతుందన్న ఆందోళన రైతుల్లో కనిపిస్తుంది.

Also Read : Cruel Man: రాక్షసుడు.. మహిళ గుండెతో కూర వండి కుటుంబసభ్యులకు తినిపించి.. ఆపై!

అవనిగడ్డ ప్రాంతంలో కల్లాల్లో ఉన్న వరి ధాన్యం ఇప్పటికే సగం తడిచిపోగా మిగతా ధాన్యాన్ని కాపాడుకోడానికి రైతులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పల్నాడు జిల్లాల్లో కూడా మిర్చి రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది ఇప్పటివరకు ఆకాశం మేఘవరతమై ఉండటం చిరుజల్లులు మాత్రమే పడుతున్నాడుతో రైతులు కొంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ వర్షాలు తీవ్రమైతే చేతికి వచ్చిన మిర్చి పంట కూడా కాపాడుకో లేమని వాపోతున్నారు. ఇంకా కొన్ని జిల్లాల్లో పంటల పైన ఈ అకాల వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. ఇవాళ… రేపు… ఎల్లుండి.. కూడా వర్షాలు భారీగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతుల గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి.

Also Read : TCS CEO: టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపినాథన్‌ రాజీనామా.. సంస్థలో అనూహ్య మార్పు

Exit mobile version