హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగర శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, బుద్వేల్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌తో పాటు.. జనగాం, సంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాల్లో సాయంత్రం పూట కురుస్తున్న జల్లుల కారణంగా చాలా జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్న ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. జనగాంలోని జఫర్‌గఢ్‌లో రాత్రి 9 గంటల సమయానికి 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, సంగారెడ్డిలోని మొగ్డంపల్లెలో 55.3మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండలోని నక్రేకల్‌లో 54.3మిల్లీమీటర్లు, యాదాద్రి భువనగిరిలోని మూటకొండూరులో 44.3మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Also Read : Off The Record: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు తథ్యమేనా?
జీహెచ్‌ఎంసీ పరిధిలో కూడా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. షేక్‌పేట, గన్‌ఫౌండ్రీలో 6.3మి.మీ, మెహిదీపట్నంలో 5.5మి.మీ. నమోదయ్యాయి. ఈదురు గాలులతో కూడిన జల్లులు అర్థరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. అయితే.. రాజేంద్రనగర్, హైదర్గూడ, అత్తాపూర్, ఉప్పర్పల్లి, మైలార్దేవ్పల్లిలో భారీ వర్షం కురుస్తోంది. అలాగే మెహదీపట్నం, మాసాబ్ ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. వర్షం ప్రభావంతో వాహనదాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
Also Read : Shubman Gill Wicket: ఒరేయ్ అంపైరు.. కళ్లు కాకులు మింగాయా?
