NTV Telugu Site icon

Rain Alert: తెలంగాణ ప్రజలకు చల్లటికబురు.. నేడు, రేపు తేలికపాటి వర్షాలు!

Rain Alert

Rain Alert

Rain Alert to Telangana: రాష్ట్రంలో భానుడు భగభగ మండిపోతున్నాడు. సూర్య ప్రతాపంతో ఎండ వేడికి తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు పైనే నమోదవుతోంది. అయితే తెలంగాణలో గత మూడు రోజులుగా వాతావరణ పరిస్థితి మారింది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా.. రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లటికబురు చెప్పింది. నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Read Also: Eid 2024 Prayer Timing: నేడు దేశవ్యాప్తంగా ఈద్‌ సంబరాలు.. ప్రార్థనల సమయం ఎప్పుడంటే?

నిర్మల్, ములుగు, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, కామారెడ్డి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, సంగారెడ్డి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశ ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

 

Read Also: Carbide Free Mango : ‘కార్బైడ్‌ రహిత మామిడి మేళా’ను ప్రారంభించిన వనజీవి రామయ్య

కాగా.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పలు మండలాల్లో అర్థరాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఆదిలాబాద్ అర్బన్‌లో 9.5 మిమీ వర్షపాతం నమోదు కాగా.. నిర్మల్ జిల్లా విశ్వనాథ్ పేటలో 8 మిమీ వర్షపాతం నమోదైంది. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. చల్లటి వాతావరణం ఏర్పడడంతో ప్రజలకు కాస్త ఎండనుంచి ఊరట లభించిందనే చెప్పాలి. మరి ఈ రెండు రోజులు చిరుజల్లులతో నేల తడియడంతో రైతులకు కూడా ఇది శుభవార్తే అని చెప్పాలి. కాకపోతే ఈ అకాల వర్షాల నేపథ్యంలో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పంటలు కోత దశకు వచ్చాయిని ఈ దశలో వర్షం కురిస్తే ఆరుగాలం శ్రమించిన పంట నీటి పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.