NTV Telugu Site icon

Rain Alert: ఏపీకి రెయిన్‌ అలెర్ట్‌.. నాలుగు రోజులు వర్షాలే..

Rains

Rains

Rain Alert to Andhrapradesh: వరుణుడు తెలుగు రాష్ట్రాలను వదలనంటున్నాడు. మరో నాలుగు రోజుల పాటు తన ప్రభావం చూపిస్తానంటున్నాడు. ఈ మేరకు రాబోయే మూడు రోజులకు సంబంధించి అమరావతి వాతావరణ విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మరో నాలుగు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. కొద్ది రోజులుగా ఏపీలో చెదురుముదురుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విదర్భ, కర్ణాటకల మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.

Read Also: Agency Bandh: ఇవాళ మన్యం బంద్

దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ విభాగం తెలిపింది. ఉత్తర కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. అదే సమయంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని, కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని పేర్కొంది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. గురువారం పార్వతీపురం మన్యం జిల్లా బలిజపేటలో 2.6 సెంటీమీటర్లు, అన్నమయ్య జిల్లా నూతనకల్వలో 2 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది.