NTV Telugu Site icon

AP Weather: ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్.. రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వర్షాలు

Rain Alert

Rain Alert

AP Weather: ఏపీలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఓ వైపు ఎండలతో జనాలు ఇబ్బందులు పడుతుండగా.. మరోవైపు వానలు కాస్తా ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. మొన్నటి వరకు ఎండలు, వేడిగాలులు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షాలతో ఉపశమనం లభించింది. ప్రధానంగా ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. ఈశాన్య రాజస్థాన్ నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు మధ్య మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా సముద్ర మట్టానికి సగటున 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో రెండు రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.

Read Also: Chandrababu: సూపర్ సిక్స్ పెట్టి ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకువస్తాం..

దీని ప్రభావంతో రేపు(శుక్రవారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అలాగే ఎల్లుండి(శనివారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Read Also: AP High Court: డీబీటీ పథకాల అమలు.. తీర్పు రిజర్వు చేసిన ఏపీ హైకోర్టు

ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తు్న్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. గురువారం సాయంత్రం 6 గంటల నాటికి కర్నూలు జిల్లా గూడూరులో 31.5మిమీ, కర్నూలు జిల్లా కొక్కరచేడులో 29మిమీ, కాకినాడ జిల్లా కృష్ణవరంలో 27.2మిమీ, గుంటూరు జిల్లా తాడేపల్లిలో 26.2మిమీ,బాపట్ల జిల్లా రేపల్లెలో 24.7మిమీ, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 24.2మిమీ, మన్యం జిల్లా సాలూరులో 23.2మిమీ అధికవర్షపాతం నమోదైందన్నారు.

రేపు శ్రీకాకుళం బూర్జ, విజయనగరం సంతకవిటి, పార్వతీపురంమన్యం పాలకొండ మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. గురువారం అనంతపురం జిల్లా మాలపురం, నంద్యాల జిల్లా నందవరంలో 39.9 డిగ్రీలు, కర్నూలు జిల్లా కోసిగిలో 39.8 డిగ్రీలు, తిరుపతి రూరల్లో 39.5 డిగ్రీలు, వైయస్ఆర్ జిల్లా బలపనూరులో 39.4 డిగ్రీలు, సత్యసాయి జిల్లా కనగానపల్లిలో 39.3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.