NTV Telugu Site icon

AP Rains : ఏపీకి భారీ వర్ష సూచన.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు

Rain

Rain

ఏపీ రాష్ట్రంలో వరుస తుపానుల కారణంగా వర్షాలు తీవ్రంగా కురుస్తున్నాయి. అనేక జిల్లాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, నదులు, వాంగులు పొంగి పోయాయి, దీంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిరంతర వర్షాల కారణంగా కొన్ని ప్రాణాలు పోయాయి, రైతులు పంటలు నష్టపోయారు. ఇప్పుడే ఆ నష్టాల నుంచి తేరుకోకముందే, మరోసారి భారీ వర్షాలు కురవబోతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో జరుగుతున్న ఉపరితల ఆవర్తనాల ప్రభావం వల్ల ఈ వర్షాలు వస్తాయని చెప్పారు.

CPI Narayana: క్షమించండి… మీ “అలయ్‌ బలయ్‌” కార్యక్రమానికి నేను రాను..

కోస్తాలో ఈ రోజు పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశముంది, 17వ తేదీ వరకు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అన్నారు. తీరం వెంబడి 40 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో ఈ రోజు ఒకటి, రెండు చోట్ల పిడుగుతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశముందని ఆర్పీ సిసోడియా తెలిపారు. భారీ వర్షాల కారణంగా 24 గంటలు విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తంగా ఉంటుందని, జిల్లా , రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లకు ముందస్తు చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు అందించారని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

Bigg Boss 8: బిగ్ బాస్ లో మరో షాకింగ్ ఎలిమినేషన్.. ఎవరంటే?