Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Railways Vs Delhi Huge Fans At Arun Jaitley Stadium For Virat Kohli Batting

Virat Kohli: రంజీ ట్రోఫీకి కళ తెచ్చిన విరాట్‌ కోహ్లీ.. కింగ్ కోసం 15 వేల మంది!

Published Date :January 31, 2025 , 10:34 am
By Sampath Kumar
  • రంజీ ట్రోఫీ 2025లో బరిలోకి విరాట్
  • కేరింతలతో మైదానాన్ని హోరెత్తించిన ఫాన్స్
  • కోహ్లీ కోసం 15 వేల మంది అభిమానులు
Virat Kohli: రంజీ ట్రోఫీకి కళ తెచ్చిన విరాట్‌ కోహ్లీ.. కింగ్ కోసం 15 వేల మంది!
  • Follow Us :
  • google news
  • dailyhunt

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రాకతో రంజీ ట్రోఫీ 2025కి కొత్త జోష్‌ వచ్చింది. అంతర్జాతీయ మ్యాచ్‌ మాదిరి అరుణ్‌ జైట్లీ స్టేడియం ‘కోహ్లీ.. కోహ్లీ’ నినాదాలతో హోరెత్తింది. గురువారం ఢిల్లీ, రైల్వేస్‌ జట్ల మధ్య ప్రారంభమైన రంజీ ట్రోఫీ గ్రూపు-డి మ్యాచ్‌లో విరాట్ బరిలోకి దిగాడు. కింగ్ ఫీల్డింగ్ చేస్తేనే అభిమానులు కేరింతలతో మైదానాన్ని హోరెత్తించారంటే.. ఇక బ్యాటింగ్ దిగి బౌండరీలు బాదితే ఇంకేమన్నా ఉందా?. మొత్తానికి విరాట్‌ రంజీ ట్రోఫీ 2025కి కళ తెచ్చాడని చెప్పాలి.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన రైల్వేస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 67.4 ఓవర్లలో 241 పరుగులకు కుప్పకూలింది. ఉపేంద్ర యాదవ్‌ (95; 177 బంతుల్లో 10×4, 1×6) తృటిలో సెంచరీ కోల్పోగా.. కర్ణ్‌ శర్మ (50; 105 బంతుల్లో 7×4, 1×6) హాఫ్ సెంచరీ బాదాడు. ఢిల్లీ బౌలర్లలో నవదీప్‌ సైనీ, సుమిత్‌ మాథుర్‌ తలో మూడు వికెట్స్ పడగొట్టారు. ఢిల్లీ మొదటి ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 63 పరుగులు చేసింది. సనత్ సాంగ్వాన్, యష్ ధుల్ ఆడుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు అవుట్ అయినా విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు దిగుతాడు. 12 ఏళ్ల తర్వాత కింగ్ దేశవాళీ క్రికెట్‌ ఆడుతుండడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి వచ్చారు. కోహ్లీని చూసేందుకు ఏకంగా 15 వేల మంది అభిమానులు వచ్చినట్లు తెలుస్తోంది. రెండోరోజు ఈ సంఖ్య మరింత ఎక్కువ కానుంది.

This is the stardom of Virat Kohli. 🙇‍♂️🐐 pic.twitter.com/zZ5vQGkclC

— Mufaddal Vohra (@mufaddal_vohra) January 31, 2025

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Delhi
  • fans
  • Railways vs Delhi
  • Ranji Trophy 2025
  • VIRAT KOHLI

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions