NTV Telugu Site icon

Delhi : అది తప్పుడు ప్రచారం.. న్యూఢిల్లీ తొక్కిసలాట ఘటనపై స్పందించి రైల్వే శాఖ

Delhistampede

Delhistampede

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనపై రైల్వే శాఖ స్పందించింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన దురదృష్టకర సంఘటనపై జరుగుతున్న విచారణకు సంబంధించి తప్పుదారి పట్టించేలా కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయని పేర్కొంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటపై RPF విచారణ అంటూ ఇవాళ తప్పుదారి పట్టించారని.. రైల్వే స్టేషన్ తొక్కిసలాటపై నార్త్ రైల్వే ఇప్పటికే ఇద్దరు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని వెల్లడించింది.

READ MORE: UPSC CSE 2025: సివిల్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తుల గడువు మరోసారి పొడిగించిన యూపీఎస్సీ

“తొక్కిసలాటపై ఉన్నత స్థాయి కమిటీ నిర్వహించే విచారణ తప్ప మరే విచారణ జరగడం లేదు. ఉన్నత స్థాయి కమిటీ 100 కి పైగా పర్సనల్ స్టేట్‌మెంట్‌లను సేకరిస్తోంది. స్టేట్‌మెంట్‌లన్నింటినీ స్వీకరించిన తర్వాత, సంఘటనకు దారితీసిన సంఘటనకు గల కారణాల పై ఖచ్చితంగా నిర్ధారిస్తారు?” అని రైల్వే శాఖ ప్రకటనలో స్పష్టం చేసింది.

READ MORE: Yadadri: మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవానికి సిద్ధమవుతున్న యాదాద్రి..

ఇదిలా ఉండగా.. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం (ఫిబ్రవరి 15) రాత్రి తొక్కిసలాట జరిగింది. ప్లాట్‌ఫారమ్ నంబర్ 14, 15లలో రైళ్ల కోసం ప్రయాణికులు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 18 మంది మరణించారు. మరి కొందరు ప్రయాణికులు గాయపడగా.. మరి కొందరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహటిన ఆసుపత్రికి తరలించారు.