NTV Telugu Site icon

Indian Railways : ఈ వార్త వింటే మీరు రైలు లేటైతే బాగుండు అంటారు

Rail

Rail

Indian Railways : రైలు ప్రయాణం సరదాగా ఉంటుంది. అందుకే ప్రతీ ఒక్కరూ రైలులో ప్రయాణించేందుకు ఆసక్తి కనబరుస్తారు. అందుకే భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా రైల్వే అవతరించింది. భారతీయ రైల్వే సంస్థ ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆ క్రమంలోనే ప్రయాణికుల సౌలభ్యం కోసం కొత్త శుభవార్త తీసుకొచ్చింది. ఇక నుంచి రైలు ప్రయాణంలో ఉచితంగా ఆహారం పొందవచ్చు. కొత్త నిబంధన ప్రకారం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు ఆహారం కోసం ప్రత్యేకంగా రుసుం చెల్లించాల్సిన పనిలేదు. కానీ ఇందుకు ఓ షరతు ఉంది.

మీరు ఎక్కే రైలు ఆలస్యంగా నడుస్తున్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. రైలు ఆలస్యం అయితే.. మీకు IRCTC ఉచితంగా ఆహారం అందజేస్తుంది. మీరు ఈ సౌకర్యాన్ని ఆనందంగా, సులభంగా ఆస్వాదించవచ్చు. ఇందుకు రుసుం చెల్లించొద్దు. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, రైలు ఆలస్యమైతే IRCTC క్యాటరింగ్ విధానంలో ప్రయాణీకులకు అల్పాహారం, తేలికపాటి భోజనం అందించబడుతుంది.

Read Also: Cheque Bounce Rules: చెక్ బౌన్స్ అయితే మీరు బుక్ అయినట్లే.. భారీ జరిమానా, జైలు శిక్ష

ఈ సదుపాయం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందంటే..
IRCTC నిబంధనల ప్రకారం.. మీ రైలు 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం అయినప్పుడు ఈ సౌకర్యం మీకు అందించబడుతుంది. ఎక్స్‌ప్రెస్ రైలులోని ప్రయాణికులు మాత్రమే ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోగలరు. శతాబ్ది, రాజధాని, దురంతో వంటి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే వారికి ఈ వార్త చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Read Also:India Oil Exports: రష్యా ఆయిల్‌తో భారత్ వ్యాపారం.. యూరప్‌కు పెరిగిన ఎగుమతులు..

అల్పాహారం ఏంటి ?
రైలులో అల్పాహారంలో టీ-కాఫీ, బిస్కెట్లు అందుబాటులో ఉంటాయి. సాయంత్రం అల్పాహారం, టీ లేదా కాఫీ, నాలుగు బ్రెడ్ స్లైసులు (గోధుమ/తెలుపు), ఒక బటర్ చిప్లెట్ ఇస్తారు. దీంతో పాటు ప్రయాణికులకు మధ్యాహ్నం రోటీ, పప్పు, కూరగాయలు తదితరాలు ఉచితంగా లభిస్తాయి. మీ రైలు ఆలస్యంగా నడుస్తుంటే నిబంధనల ప్రకారం ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు.