Notice to God : ప్రభుత్వ భూములను కబ్జా చేసి నివాసాలు ఏర్పరుచుకోవడం నేరం. అలాంటి స్థలాల నుండి ప్రజలను ఎప్పుడైనా ఖాళీ చేయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ సమయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తుంటాయి. గొడవలు జరుగుతుంటాయి. చాలా కాలం పాటు ఆక్రమిత స్థలాల్లో నివాసాలను ఏర్పాటు చేసుకున్నట్లయితే వారికి పునారావసం కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవచ్చు.. తీసుకోకపోవచ్చు. రైల్వే స్థలాల్లో, రైల్వే ట్రాక్ ల వెంబడి నివాసాలను ఏర్పాటు చేసుకున్న వారిని తొలగించడంలో ఆ శాఖకు ఎప్పుడూ తలనొప్పులే ఎదురవుతుంటాయి. ఇదే క్రమంలో మధ్యప్రదేశ్ రైల్వే శాఖ ఓ స్థలాన్ని ఖాళీ చేయాలని విచిత్రమైన నోటీసు పంపి వార్తల్లో నిలిచింది.
Read Also: Dhananjay Munde : 101జేసీబీలు, 10టన్నుల పూలు.. గ్రాండ్ ఎంట్రీ అదిరిందయ్యా
మధ్యప్రదేశ్‌లోని రైల్వే అధికారులు ఏకంగా హనుమంతుడికి నోటీసులు జారీచేశారు. ‘మీరు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు.. వెంటనే ఖాళీ చేయకపోతే చర్యలు తీసుకుంటాం’ అంటూ ఆంజనేయుడికి హుకుం జారీ చేశారు. మొరెనా జిల్లాలో సబల్‌గర్ ప్రాంతంలో రైల్వే బ్రాడ్‌గేజ్ పనులు జరుగుతున్నాయి. హనుమంతుడి ఆలయం ఉన్న ప్రాంతం రైల్వేదని గుర్తించిన అధికారులు వెంటనే దానిని తొలగించాలంటూ ఆంజనేయుడికి నోటీసులు జారీ చేశారు. దాని కూల్చివేత, ఆ స్థలం పునరుద్ధరణకు అయ్యే ఖర్చును సైతం మీ నుంచే వసూలు చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. కాగా, దీనిపై రైల్వే అధికారి మనోజ్‌కుమార్ వివరణ ఇస్తూ పొరపాటున దేవుడి పేరిట నోటీసు జారీ చేశామని, గుడి పూజారి పేరిట కొత్త నోటీసు ఇస్తామని వివరణ ఇచ్చారు.
Read Also: Cm Jagan Mohan Reddy: గవర్నర్ బిబి హరిచందన్ తో సీఎం జగన్ భేటీ