Dinesh karthik: కోహ్లీ వారసుడు గిల్ కాదు.. దినేశ్ కార్తీక్ వింత స్టేట్‌మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శుభ్‌మన్ గిల్.. ప్రస్తుతం టీమిండియా భవిష్యత్ స్టార్‌గా దూసుకెళ్తున్నాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ, టీ20ల్లో సెంచరీ చేసి జోరుమీదున్నాడు. ఈ నేపథ్యంలోనే స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి అతడే సరైన వారసుడంటూ అందరూ కితాబిస్తున్నారు. భవిష్యత్‌లో కోహ్లీ రికార్డుల్ని తిరగరాస్తాడంటూ కొనియాడుతున్నారు. అయితే వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ మాత్రం కోహ్లీ వారసుడు గిల్ కాదంటున్నాడు. కార్తీక్ చెప్పినదాని ప్రకారం రాహుల్ త్రిపాఠి విరాట్ స్థానాన్ని భర్తీ చేస్తాడట. అది ఎందుకో కూడా కార్తీక్ వివరించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో అందరి కళ్లూ 63 బంతుల్లోనే 126 రన్స్ చేసిన గిల్‌పైనే ఉన్నాయి. కానీ అంతకుముందే కివీస్ బౌలర్లను చిత్తుచిత్తుగా కొట్టాడు త్రిపాఠి. అతడు కేవలం 22 బాల్స్ లోనే 44 రన్స్ చేశాడు. అతని ఈ ఇన్నింగ్స్ చూసిన తర్వాత ఓ స్పోర్ట్స్ మీడియాతో మాట్లాడుతూ కార్తీక్ ఈ కామెంట్స్ చేశాడు.
Also Read: Bathroom Thief: దొంగతనానికి వచ్చాడు.. ఆపుకోలేక ఎంజాయ్ చేశాడు
Also Read
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
“నేను ఇప్పుడు చెప్పబోయేది రాహుల్ త్రిపాఠి కోసం కాదు. క్రికెట్ అభిమానులందరి కోసం. భవిష్యత్తులో మరచిపోకండి. కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే వాళ్ల పేర్లు గొప్పవే. అతడు కేవలం 30, 40 స్కోర్లే చేశాడు కదా అని అనొచ్చు.కానీ అతడు బ్యాటింగ్‌కు దిగిన ప్రతిసారి ఉన్న పరిస్థితులు గమనించాలి. తన కెరీర్‌కు ముప్పు అని తెలిసినా నిస్వార్థంగా అతడు దూకుడుగా ఆడుతున్నాడు. ఇది చాలా రిస్క్. అయినా చేస్తున్నాడు. ఎందుకంటే తన టీమ్ కచ్చితంగా గెలవాలి అన్న ఉద్దేశంతో. వచ్చే ఆరు నెలల్లో అతడు ఐపీఎల్‌లో బాగా ఆడొచ్చు.. లేకపోవచ్చు. కానీ ఇండియన్ టీమ్‌లో మూడో స్థానానికి మాత్రం అతడు అర్హుడు. కోహ్లీ ఆడాలని అనుకుంటే సరే. కానీ కోహ్లీ లేకపోతే మాత్రం త్రిపాఠి మొదటి ఛాయిస్ కావాలి. మరో స్థానంలో బాగా ఆడిన ప్లేయర్ కాకూడదు. తన కెరీర్‌కు రిస్క్ అని తెలిసినా శ్రీలంకతో చివరి మ్యాచ్‌లో అతడు అద్భుతంగా ఆడాడు. అతనికి ఎక్కువ అవకాశాలు రాలేదు. అయినా దూకుడుగా, రిస్క్ తీసుకుంటూ ఆడాడు. కెప్టెన్, కోచ్ ఏం ఆశించారో అలాగే ఆడాడు” అని త్రిపాఠి గురించి కార్తీక్ చెప్పాడు.
Also Read: Milk Price Hike: పాలధరలు మరోసారి పెంపు..లీటర్‌పై ఎంతంటే?
శ్రీలంకతో జరిగిన చివరి టీ20లో రాహుల్ త్రిపాఠి 16 బంతుల్లోనే 35 పరుగులు చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌లో త్రిపాఠితో కలిసి ఆడిన కార్తీక్.. అతనిలో ఉన్న ప్రత్యేకత గురించి కూడా వివరించాడు. “అతని డీఎన్ఏలోనే అతని గొప్పతనం దాగుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎంత పెద్ద మ్యాచ్ అయినా కూడా దూకుడుగా ఆడతాడు. ఇలాంటి ప్లేయర్సే కావాలి. ఎందుకంటే పెద్ద మ్యాచ్‌ల్లో వీళ్లు పరిస్థితులతో సంబంధం లేకుండా తమకు వచ్చిన ఆట ఆడతారు” అని కార్తీక్ చెప్పాడు.
తాజావార్తలు
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!