Site icon NTV Telugu

Rahul Gandhi Bus Yatra: రాహుల్ గాంధీ బస్సు యాత్రలో మార్పులు.. రేపటి షెడ్యూల్ ఇదే..?

Bus Yatra

Bus Yatra

తెలంగాణలో రాహుల్ గాంధీ బస్సు యాత్రలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. నిజామాబాద్‌లో రేపు సాయంత్రం జరగాల్సిన పాదయత్ర క్యాన్సిల్ అయింది. రేపు ఆర్మూరులో పసుపు, చెరుకు రైతులతో ముఖాముఖీ సమావేశం అవుతారు. అనంతరం బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. అత్యవసర సమావేశం ఉండడంతో రాహుల్ గాంధీ ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలుస్తుంది.

Read Also: Vishal 34 : క్లైమాక్స్ షాట్ అప్డేట్ ఇచ్చిన విశాల్..

రేపు రాహుల్ గాంధీ బస్ యాత్ర షెడ్యూల్ ఇదే..?
అయితే, రేపు ఉదయం 8.30 గంటలకు కరీంనగర్ లోని వీపార్క్ హోటల్ నుంచి బయలుదేరనున్న రాహుల్ గాంధీ.. 9 గంటలకు చొప్పదండి అసెంబ్లీ నియోజక వర్గం గంగాధర దగ్గర సమావేశం కానున్నారు. 9.30 గంటలకు కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇక, 11 గంటలకు జగిత్యాల పట్టణంలో కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. అలాగే, మధ్యాహ్నం 12గంటలకు వేములవాడ నియోజక వర్గం మేడిపల్లిలో సమావేశంలో పాల్గొననున్నారు. కోరుట్లలో మధ్యాహ్నం 1గంటకు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ముక్కస్ కన్వేషన్ లో భోజన విరామం తీసుకోనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ తలపెట్టిన సభలో పాల్గొని రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. ఈ సభ అనంతరం అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ కు వచ్చి.. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి విమానంలో రాహుల్ గాంధీ వెళ్లనున్నారు.

Exit mobile version