NTV Telugu Site icon

Congress: త్వరలో తెలంగాణకు రాహుల్ గాంధీ.. సూర్యాపేటలో సభ..?

Delhi

Delhi

ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ నివాసంలో టీ కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహా, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫిబ్రవరిలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారుపై ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ తో రాష్ట్ర మంత్రులు, ఇతర నేతలు చర్చించారు. ఢిల్లీలోని కేసి వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై చర్చించారు. సంస్థాగత అంశాలతో పాటు, శాఖల వారీగా పనితీరుపై సమీక్ష చేపట్టారు. కేసీ వేణు గోపాల్ మంత్రులతో ముఖాముఖి భేటీలు నిర్వహించారు.

Read Also: TTD Tickets: తిరుమలలో నకిలీ టికెట్ల కలకలం.. పోలీసుల అదుపులో ముగ్గురు!

సమావేశం అనంతరం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో సూర్యాపేట లేదా ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. “సంవిధాన్ బచావో” (రాజ్యాంగం పరిరక్షణ) ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారని అన్నారు. ఈ సమావేశంలో ఈ నెలాఖరు కల్లా నామినేటేడ్ పదవులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అంతేకాకుండా.. పీసీసీ కార్యవర్గం ఏర్పాటు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే నిజమైన కార్యకర్తలకే జిల్లా కాంగ్రెస్ కమిటీ” (డీసీసీ) అధ్యక్ష పదవులివ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డీసీసీ అధ్యక్షులు ప్రతిపాదించి, సిఫార్సు చేసే వారికే ప్రాధాన్యతనిచ్చి, వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనుంది అధిష్ఠానం. వచ్చే జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం దిశగా సమిష్టిగా సన్నద్దం కావాలని నిర్దేశం చేశారన్నారు. మంత్రివర్గ విస్తరణ, మార్పులు, చేర్పులు పై అధిష్ఠానం, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

Read Also: Manchu Manoj: బయటినుంచి రౌడీలను తీసుకొచ్చారు..వాళ్లకు నేను ఒక్కడిని చాలు!

Show comments