NTV Telugu Site icon

Rahul Gandhi: ప్రియాంక గాంధీకి సవాల్ విసిరిన రాహుల్.. మరి నెరవేర్చగలదా?

Rahul Gandi

Rahul Gandi

Rahul Gandhi: కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన సోమవారం వయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ తన చెల్లెలు, కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీకు సవాల్ విసిరారు. ప్రియాంక గాంధీ ఎంపీ అభ్యర్థి అని ఆయన అంటూనే.. ఆమె నా చెల్లెలు కూడా కాబట్టి, ఆమెపై వాయనాడ్ ప్రజలకు ఫిర్యాదు చేసే హక్కు నాకుంది. వయనాడ్‌కు నా హృదయంలో చాలా పెద్ద స్థానం ఉందని రాహుల్ అన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎప్పుడైనా సహాయం చేస్తానని అన్నారు.

Also Read: Explosion In IOCL: ఐఓసీఎల్ రిఫైనరీలో భారీ పేలుడు

ఈ సందర్బంగా.. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీకు ‘సవాల్’ విసిరాడు. వాయనాడ్‌ను ఉత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని నా సోదరిని కూడా సవాలు చేయాలనుకుంటున్నానని కాంగ్రెస్ రాహుల్ గాంధీ అన్నారు. ప్రజలు కేరళ గురించి ఆలోచించినప్పుడు, మొదటి గమ్యం వాయనాడ్ అయి ఉండాలి. ఇది వాయనాడ్ ప్రజలకు, దాని ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అన్నారు. అలాగే జులైలో కేరళ జిల్లా కొండచరియలు విరిగిపడి వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లోక్‌సభ ఎన్నికల్లో రెండు స్థానాలను గెలుచుకున్న రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నియోజకవర్గాన్ని నిలబెట్టుకోవాలని నిర్ణయించుకోవడంతో వయనాడ్ ఉప ఎన్నిక అనివార్యమైంది. తొలి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రియాంక గాంధీ వాద్రా సీపీఐకి చెందిన సత్యన్ మొకేరి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌తో తలపడనున్నారు. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Also Read: Encounter: సిఆర్‌పిఎఫ్ క్యాంపుపై దాడి.. 11 మంది ఉగ్రవాదులు హతం

Show comments