Site icon NTV Telugu

Rahul Gandhi: రాహుల్ భారత్‌ జోడో న్యాయ యాత్ర షెడ్యూల్ మార్పు

Rahul Gandhi

Rahul Gandhi

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతోంది. అయితే త్వరలో జరగనున్న యూపీ షెడ్యూల్‌లో స్పల్ప మార్పు చోటుచేసుకుంది. ఈ నెల 16న ఉత్తరప్రదేశ్‌లోకి రాహుల్ యాత్ర ప్రవేశించనుంది. అయితే నెక్ట్స్ వీక్ నుంచి అక్కడ బోర్డు ఎగ్జామ్స్‌ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదన్న ఆలోచనతో యాత్రను ముందుగానే ముగించాలని రాహుల్ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

యూపీలో ఫిబ్రవరి 22 నుంచి బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 26 వరకు కొనసాగనున్న యాత్రను ఈ నెల 21కే ముగిసేలా రాహుల్‌ మార్పులు చేశారని రాష్ట్ర కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అన్షు అవస్తీ ఓ ప్రకటనలో వెల్లడించారు. రాహుల్‌ గాంధీ అనేక సందర్భాల్లో ప్రజా ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని ఆయన గుర్తుచేశారు

యూపీలో యాత్ర ఇలా ప్రారంభం..
ఫిబ్రవరి 16న వారణాసి మీదుగా యాత్ర ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది. అనంతరం భదోహి, ప్రయాగ్‌రాజ్‌, ప్రతాప్‌గఢ్‌ మీదుగా ఈ నెల 19న అమేఠీకి చేరుకుంటుంది. ఆ నియోజకవర్గంలోని గౌరీగంజ్‌ బహిరంగ సభలో రాహుల్‌ ప్రసంగిస్తారు. మరుసటి రోజు రాయ్‌బరేలీకి చేరుకుని.. అక్కడి నుంచి లఖ్‌నవూలో రాహుల్‌తో సహా మార్చ్‌లో పాల్గొంటారు. 21న కాన్పూర్‌లోకి యాత్ర ప్రవేశిస్తుంది. అదే రోజు ఝాన్సీ నుంచి మధ్యప్రదేశ్‌లోకి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Exit mobile version