Rahul Gandhi: మోడీ, షా స్టాక్ మార్కెట్లో భారీ కుంభకోణానికి పాల్పడ్డారు(వీడియో)
Sriram Kumar Natte
Maxresdefault (1)
Rahul Gandhi Sensational Comments Stock market Scam: స్టాక్ మార్కెట్ ప్రస్తుతం రాజకీయ వివాదంగా మారింది. లోక్ సభ ఎన్నికల తరువాత భారీ స్టాక్ మార్కెట్ కుంభకోణం జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, మరియు ప్రభుత్వ అధికారులు పెట్టుబడిదారులకు సలహాలు ఇచ్చారని ఆరోపించారు. ఇక దీని పైనా జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణను కోరారు రాహుల్ గాంధీ. మరో వైపు బీజేపీ ఈ ఆరోపణలను ఖండిస్తూ, లోక్ సభా ఎన్నికలో ఓటమిని తట్టుకోలేక కాంగ్రెస్ ఈ ప్రకటనలు చేస్తోందని తెలిపారు బీజేపీ నేత పీయూష్ గోయెల్. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూసింది, దాదాపు 30 లక్షల కోట్ల ఆదాయం వృథా అయింది.